»   » 'నిప్పు' సినిమాలో సెట్స్ గురించి గుణశేఖర్ ఏమంటున్నారంటే...

'నిప్పు' సినిమాలో సెట్స్ గురించి గుణశేఖర్ ఏమంటున్నారంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుణశేఖర్ చిత్రాల్లో సెట్స్ కు ఉండే ప్రాధాన్యత వేరు.ఒకసారి ఛార్మినార్ సెట్ వేస్తే,మరోసారి మీనాక్షి దేవాలయం సెట్ వేయిస్తారు.కథలో భాగంగా అవి కలిసిపోతాయి కూడా.అయితే ఆయన రీసెంట్ గా వరస ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్నారు.తాజాగా రవితేజ హీరోగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు.అయితే ఆ చిత్రంలో సెట్స్ ఉంటాయా ఉండవా అన్నది అంతటా హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయంపై గుణశేఖర్ స్పందిస్తూ..నా సినిమా అనేసరికి సెట్లు తప్పకుండా ఉంటాయనుకొంటారు. ఈ సినిమాలో సెట్స్‌ వేసే అవసరం లేదు.వాటికి మించిన ఎన్నో మంచి విషయాలు 'నిప్పు'లో ఉంటాయన్నారు.అలాగే రవితేజ హుషారుకి అద్దం పట్టే చిత్రమిది. ఏదో ముగ్గురు మిత్రులు కలిసి చేస్తున్నట్టు కాదు... ఓ దర్శకుడు, ఓ హీరో, ఓ నిర్మాతగానే శ్రమిస్తాం అని తేల్చి చెప్పారు.

English summary
Gunashekar informed the media that Nippu film will not have huge sets or graphics. This really comes as surprise as Gunashekar is known for creating huge sets in his films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu