»   » నితిన్ ‘గుండెజారి...’ 100 డేస్ సెంటర్స్ లిస్ట్

నితిన్ ‘గుండెజారి...’ 100 డేస్ సెంటర్స్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నితిన్, నిత్యామీనన్ జంటగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం బ్లక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27తో ఈచిత్రం 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. నితిన్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా 16 సెంటర్లలో ఈచిత్రం 100 రోజుల వేడుక జరుపుకుంటుండటం గమనార్హం.

100డేస్ సెంటర్స్ లిస్ట్

1. శాంతి థియేటర్ (హైదరాబాద్)
2. అర్జున్ థియేటర్ (హైదరాబాద్)
3. కపార్ధి థియేటర్ (విజయవాడ)
4. విమాక్స్ మల్టిప్లెక్స్(వైజాగ్)
5. లక్ష్మణ్ థియేటర్ (వరంగల్)
6. సుందర్ థియేటర్ (ఖమ్మం)
7. విజయ్ థియేటర్ (నిజామాబాద్)
8. బాలాజీ థియేటర్ (మహబూబ్ నగర్)
9. టాలీవుడ్ థియేటర్ (గుంటూరు)
10. ప్రియా థియేటర్ (తెనాలి)
11. గోరంట్ల మల్టీప్లెక్స్ (ఒంగోలు)
12. ఎస్ 2 సినిమాస్ (నెల్లూరు)
13. కార్తీక థియేటర్ (శ్రీకాకుళం)
14. కృష్ణా టాకీస్ (విజయనగరం)
15. ఆనంద్ థియేటర్ (కర్నూలు)
16. ద్వారక కాంప్లెక్స్ (నంద్యాల)

ఇప్పటికే ఈచిత్రం 142 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర నిర్మాత, నితిన్ సోదరి నిఖితా రెడ్డి మాట్లాడుతూ కథను నమ్మడం వల్లనే తమకు ఈ విజయం దక్కిందన్నారు. ప్రస్తుతం తెలుగు తెరపై రకరకాల కథలతో చిత్రాలు వస్తున్నా, అందరూ కలసి చూసే విధంగా లేకపోవడంతో సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాయని, నితిన్‌తో తాము నిర్మించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ముఖ్యంగా కుటుంబాలకు నచ్చడంతో విజయవంతం అయిందని నిఖితారెడ్డి తెలిపారు.

నితిన్ ప్రస్తుతం 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా చేస్తున్నాడు. ఈచిత్రం తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ మార్కు పడేలా సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు నితిన్. గతంలో పవన్ కళ్యాణ్‌కు 'తొలిప్రేమ' లాంటి భారీ విజయాన్ని అందించిన కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాడని తెలిసింది. ప్రస్తుతం చేస్తున్న 'కొరియర్ బోయ్ కల్యాణ్' సినిమా తరువాత కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది' అని తన సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో నితిన్ తెలిపాడు.

English summary
Nitin and Nithya Menon’s Gunde Jaari Gallanthayyinde was released on April 19 2013 and running towards to complete 100 days Tomorrow in 16 Centers ( July 27-2013 ).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu