»   » నితిన్ ‘గుండెజారి...’ 50 డేస్ 142 సెంటర్స్

నితిన్ ‘గుండెజారి...’ 50 డేస్ 142 సెంటర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నితిన్, నిత్యామీనన్ జంటగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం బ్లక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 7తో ఈచిత్రం 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. నితిన్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా 142 సెంటర్లలో ఈచిత్రం 50 రోజుల వేడుక జరుపుకుంటుండటం గమనార్హం.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నితిన్ సోదరి నిఖితా రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఈనెల 7కు 142 కేంద్రాలలో 50 రోజులు పూర్తిచేసుకోనుందని, ఈ సందర్భంగా ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె తెలిపారు. కథను నమ్మడం వల్లనే తమకు ఈ విజయం దక్కిందన్నారు.

ప్రస్తుతం తెలుగు తెరపై రకరకాల కథలతో చిత్రాలు వస్తున్నా, అందరూ కలసి చూసే విధంగా లేకపోవడంతో సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాయని, నితిన్‌తో తాము నిర్మించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ముఖ్యంగా కుటుంబాలకు నచ్చడంతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని నిర్మా త నిఖితారెడ్డి తెలిపారు.

నితిన్ ప్రస్తుతం 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా చేస్తున్నాడు. ఈచిత్రం తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ మార్కు పడేలా సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు నితిన్. గతంలో పవన్ కళ్యాణ్‌కు 'తొలిప్రేమ' లాంటి భారీ విజయాన్ని అందించిన కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాడని తెలిసింది. 'ప్రస్తుతం చేస్తున్న 'కొరియర్ బోయ్ కల్యాణ్' సినిమా తరువాత కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది' అని తన సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో నితిన్ తెలిపాడు.

English summary

 Gunde Jaari Gallanthayyinde written by Harshavardan directed by Vijay Kumar Konda. The film was produced by N. Nikitha Reddy and presented by Vikram Gowd under Sresht Movies banner. The film features Nitin,Isha Talwar and Nithya Menen in the lead role. The movie will be compleated 50 day in 142 centers on June 07.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu