For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘గుండెల్లో గోదారి’ ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక(ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నటించి, నిర్మించిన చిత్రం 'గుండెల్లో గోదారి'. ఆది, సందీప్‌ కిషన్, తాప్సీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటలు విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు.

  తెలుగులో మంచి సినిమాలు రావాలని కోరుకొనే ప్రేక్షకులు 'గుండెల్లో గోదారి'ని తప్పకుండా చూడాలి. అచ్చమైన తెలుగు సినిమా ఇది. గోదారి తీరం, ఆ సంస్కృతి, సంప్రదాయాలు చూసి ఎన్నాళ్త్లెందో. మొదటి రెండు రీళ్లు చూడగానే నాకు మతిపోయింది. నా జీవితంలో ఎన్నో వరదల్ని చూసుంటాను. అలాంటి దృశ్యాల్ని ఈ చిత్రంలో చక్కగా తెరకెక్కించారు. వాటిని చూస్తుంటే ఒళ్లు జలదరించింది. బూతుకోసమో, రికార్డ్‌ డ్యాన్స్‌లకోసమో సినిమాకి రావాలనుకొనేవాళ్లు ఈ చిత్రానికి రావొద్దు. ప్రేక్షకులు రసహృదయులైతే ఈ సినిమా ఎన్నాళ్త్లెనా ఆడుతుంది. లేదంటే ఒక మంచి సినిమా తీశామన్న సంతృప్తి వీళ్లకు మిగిలిపోతుంది అంటూ దాసరి ఈ స్టేజిపై ఎమోషనల్ గా స్పందించారు.

  ''ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. మీరు చూడకపోయినా ఫర్వాలేదు కానీ... పైరసీని మాత్రం ప్రోత్సహించవద్దు. 8న తెలుగులో, 22న తమిళంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు లక్ష్మీప్రసన్న.

  బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 'గుండెల్లో గోదారి' ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

  ఈ వేడుకకు దాసరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆది పినిశెట్టి, తాప్సి జంటగా నటించిన చిత్రమిది. సందీప్‌ కిషన్‌ ముఖ్యభూమిక పోషించారు. లక్ష్మీప్రసన్న కీలక పాత్ర పోషిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. కుమార్‌ నాగేంద్ర దర్శకత్వం వహించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

  ''తెలుగు చిత్ర పరిశ్రమకు వెలుగునిచ్చేది చిన్న సినిమాలే. వాటిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు'' అన్నారు దాసరి నారాయణరావు.

  ప్లాటినమ్‌ డిస్క్‌ జ్ఞాపికల్ని చిత్రబృందానికి దాసరి అందచేసారు.

  మోహన్ బాబు తన చిన్న కుమారుడు మంచు మనోజ్, లక్ష్మిలతో ముచ్చటగా ముచ్చటిస్తూ...

  అక్క, తమ్మళ్లు ఏదో విషయమై సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్లు ఉన్నారు.

  మోహన్‌ బాబు మాట్లాడుతూ ''సినిమా ఎలా ఆడుతుందో నేను చెప్పలేను కానీ... చాలా బాగా తీశారని మాత్రం చెప్పగలను. భారతదేశంలోని అవార్డులన్నీ లక్ష్మీకి వచ్చేస్తాయేమో అనిపిస్తోంది. తన నటన చూసి నేను ఏడ్చేశాను. ఈ సినిమా తనకి మరింత మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకముంది.'' అన్నారు.

  కీరవాణి మాట్లాడుతూ ''ఇళయరాజాని కలిసే అవకాశం కల్పించింది ఈ సినిమా పాటల వేడుక. గోదావరిలోని వేగంలాగే మోహన్‌ బాబు మాట కూడా. ఆ నీళ్లు ఎంత స్వచ్ఛమో ఆయన మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఆయన బిడ్డ తీసిన ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకొంటున్నా'' అన్నారు.

  మోహన్ బాబు, తన కూతురుతో ఏదో విషయమై చర్చిస్తూ ఇలా..

  దాసరిగారు ఈ వేడుకలో చాలా ఉత్సాహంగా తన సొంత పంక్షన్ లా పాల్గొని ఉద్వేగంగా మాట్లాడారు.

  దాసరి మాట్లాడుతూ... నా ఇంట్లో బాధ కలిగినా, మోహన్‌ బాబు ఇంట్లో బాధనైనా... మేం కుటుంబ సభ్యుల్లా ఒకరికొకరం పంచుకొంటాం. నా నుంచే మోహన్‌ బాబుకి క్రమశిక్షణ వచ్చిందని అంటుంటాడు. కానీ క్రమశిక్షణ విషయంలో నాకంటే రెండడుగులు ముందే ఉన్నాడతను. తన ముగ్గురు బిడ్డల్ని తనకంటే క్రమశిక్షణగా పెంచాడు. వాళ్లని చూసి చాలా మంది నటులు చాలా విషయాలు నేర్చుకోవాలి. మోహన్‌ బాబు బిడ్డలు తనకంటే ఎక్కువగా కష్టపడ్డారు. భవిష్యత్తులో మోహన్‌ బాబు ముగ్గురు బిడ్డలతోనూ సినిమాలు చేస్తాను అన్నారు.

  చిత్రం విజయం సాధించాలని గెస్ట్ లుగా వచ్చిన వారంతా ఆకాంక్షించారు.

  ఇళయరాజా మనసుపెట్టి చేసిన పల్లెటూరి వాతావరణమున్న ప్రతి సినిమా విజయవంతమైంది. ఈ సినిమాకి ఆయన సమకూర్చిన సంగీతం నా మనసుకు హత్తుకొంది అని మోహన్ బాబు చెప్పారు.

  ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, పరుచూరి గోపాలకృష్ణ, కోటి, మంచు మనోజ్‌, జి.నాగేశ్వరరెడ్డి, శ్రీవాసు, కార్తీక, కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌, సందీప్‌కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

  ఈ చిత్రం 8న తెలుగులో, 22న తమిళంలో విడుదల కానుంది.

  కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు, అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది.

  English summary
  Manchu Laxmi's Gundello Godari movie triple platinum disc event held at Hyderabad last night.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X