»   » యాంకర్ రష్మి, శద్ధ హాట్ లుక్స్ ‘గుంటూరు టాకీస్’

యాంకర్ రష్మి, శద్ధ హాట్ లుక్స్ ‘గుంటూరు టాకీస్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారబాద్: జబర్దస్త్ యాంకర్ రష్మి ‘గుంటూరు టాకీస్' చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతోంది. చందమామకథలు చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విలక్షణ కథాంశాలకు సున్నితమైన భావోద్వేగాల్ని జోడించి సినిమాల్ని తెరకెక్కించే ఈ దర్శకుడు ఈ సినిమాలో కూడా తనదైన మార్కు చూపించబోతున్నాడు.

ఆర్‌కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్దూ, నరేష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తుండగా హీరోయిన్‌లుగా శ్రద్ధాదాస్, జబర్దస్త్ యాంకర్ రశ్మీ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో మహేష్ మంజ్రేకర్, రఘుబాబు, వెంకట్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

జిల్లాలో ఇతర ప్రాంతాలకు దీటుగా అందమైన లోకేషన్లు ఉన్నాయని, ఇప్పటి దాకా వీటిని సినిమాల్లో ఎవరూ ఉపయోగించుకోలేకపోయారని, అందుకే సినీ పరిశ్రమకు అనంతపురం జిల్లాను పరిచయం చేయడం కోసం ఇక్కడ షూటింగ్ నిర్వహించేలా చూసినట్లు సినీనటుడు నరేష్ తెలిపారు.

ఈ సినిమా గుంటూరు స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని, ఇందులో ప్రవీణ్ ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదని ఈ చిత్ర టీం అంటోంది. ఈ సినిమాలో 200 మంది స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు. మానవీయ విలువల మేళవింపుతో సాగే ఈ చిత్రంలో అంతర్లీనంగా చక్కటి సందేశముంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

స్లైడ్ షోలో ‘గుంటూరు టాకీస్' చిత్రానికి సంబంధించిన ఫోటోలు...

రష్మి

రష్మి

గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మి...

శ్రద్ధా దాస్

శ్రద్ధా దాస్

గుంటూర్ టాకీస్ చిత్రంలో గన్ పట్టుకుని యాక్షన్ సీన్లో శ్రద్ధా దాస్.

రష్మి-సిద్ధూ

రష్మి-సిద్ధూ


గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మి, సిద్దూ...

ప్రెస్ మీట్

ప్రెస్ మీట్

గుంటూరు టాకీస్ ఫస్ట్ లుక్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ దృశ్యం.

ప్రెస్ మీట్ ఫోజు

ప్రెస్ మీట్ ఫోజు

గుంటూరు టాకీస్ ప్రెస్ మీట్ సందర్భంగా సిద్ధూ, రష్మి ఇలా ఫోటోలకు పోజులు ఇచ్చారు.

English summary
Telugu Movie Guntur Talkies Press Meet event held at hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu