»   » వీడికి నిజంగానే చెయ్యి దురదయ్యా బాబూ... (‘గుంటూరోడు’ టీజర్)

వీడికి నిజంగానే చెయ్యి దురదయ్యా బాబూ... (‘గుంటూరోడు’ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మ‌నోజ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.కె.స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవ‌రుణ్ అట్లూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం గుంటూరోడు.

ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైదరాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య్ర‌మంలో మంచు మ‌నోజ్‌, భానుశ్రీ, ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.సత్య‌, నిర్మాత శ్రీవ‌రుణ్ అట్లూరి, డైరెక్ట‌ర్ బాబీ, కాశీవిశ్వ‌నాథ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ సిద్ధార్థ్ రామ‌స్వామి, శ్రీవ‌సంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

గుంటూరోడు టీజర్

మంచు మ‌నోజ్ మాట్లాడుతూ - `` గుంటూరోడు ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చెప్ప‌న‌టువంటి మాస్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో చెప్పాను. బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీకి, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ద‌ర్శ‌కుడు స‌త్య సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. నిర్మాత వ‌రుణ్‌ ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా సినిమాను ఖ‌ర్చు పెట్టి తీశారు. అలాగే శ్రీవ‌సంత్‌గారు మంచి సంగీతాన్నిచ్చారు. వెంక‌ట్ మాస్ట‌ర్ నా కెరీర్ బెస్ట్ ఫైట్స్‌ను కంపోజ్ చేశారు. ఈ సినిమా కోసం నేను కూడా ఎగ్జ‌యిట్మెంట్‌తో ఎదురుచూస్తున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.స‌త్య మాట్లాడుతూ

ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.స‌త్య మాట్లాడుతూ

ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.స‌త్య మాట్లాడుతూ - ``ఈ సినిమాకు నా స్నేహితుడు ప్రొడ్యూస‌ర్ కావ‌డం చాలా క‌లిసి వ‌చ్చింది. నిర్మాత మంచి ప్యాష‌న్‌తో సినిమాను నిర్మించారు. మనోజ్ స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను చాలా త్వ‌ర‌గా పూర్త చేసేశాం. హీరోయిన్‌తో ఉండే ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. మ‌నోజ్ క్యారెక్ట‌ర్‌లో ఇర‌గ‌దీశాడు. టీజ‌ర్ బావుంద‌ని అంటున్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఇంకా బావుంటుంది. సినిమా అంత‌క‌న్నా బావుంటుంది. సినిమాలో ఫైట్స్ కూడా హైలైట్ అవుతాయి`` అన్నారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

నిర్మాత శ్రీవ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ - ``అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జ‌న‌వ‌రి చివ‌ర్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

నటీనటులు, తారాగణం

నటీనటులు, తారాగణం

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, కోట‌శ్రీనివాస‌రావు, రావు ర‌మేష్‌, సంప‌త్‌, పృథ్వీ, కాశీవిశ్వ‌నాథ్‌, భానుశ్రీ, ప్ర‌వీణ్‌, స‌త్య త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యంః రామ‌జోగ‌య్య‌శాస్త్రి, భాస్క‌ర భ‌ట్ల‌, శ్రీవసంత్‌, కొరియోగ్ర‌ఫీః శేఖ‌ర్‌, విజ‌య్‌, ఫైట్స్ః వెంక‌ట్‌, ఆర్ట్ః స‌త్య శ్రీనివాస్‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రాఫ‌ర్ః సిద్ధార్థ్ రామ‌స్వామి, సంగీతంః శ్రీవ‌సంత్‌, నిర్మాతః శ్రీవ‌రుణ్ అట్లూరి, ద‌ర్శ‌క‌త్వంః ఎస్‌.కె.స‌త్య‌.

English summary
Manchu Manoj acted Gunturodu Movie Teaser Launch held at Prasad Labs, Jubilee Hills, Hyderabad today (12th Dec) morning
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu