twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుద్దాల అశోక్‌ తేజకు గురజాడ విశిష్ట పురస్కారం

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, డా.సుద్దాల అశోక్‌ తేజకు గురజాడ విశిష్ట పురస్కారం (2014)ను ప్రదానం చేయనున్నట్లు గురజాడ సాంస్కృతిక సమాఖ్య (విజయనగరం) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30న విజయనగరంలోని గురజాడ కళాభారతిలో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేస్తామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌ పేర్కొన్నారు. అదేరోజు గురజాడ సాహితీ చైతన్యోత్సవంలో భాగంగా మహాకవి గురజాడ స్వగృహం నుంచి వూరేగింపు, గురజాడ రచనలపై సాహితీ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

    సుద్దాల అశోక్ తేజ గతంలో ఠాగూర్ (2003) చిత్రం లో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. ఆయన నల్గొండ జిల్లా సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి సుద్దాల హనుమంతు మరియు తల్లి జానకమ్మ.

    బాల్యం నుంచే ఆయన పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ మెట్‌పల్లి లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్ కు మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు.

    ‘Gurajada Visista Puraskar’ for Suddala Ashok Teja

    అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. ఒసేయ్ రాములమ్మా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

    2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ అవార్డు. అంతకుముందు శ్రీశ్రీకి (అల్లూరి సీతారామరాజు సినిమాలో "తెలుగు వీర లేవరా" అనే పాటకు), వేటూరి సుందరరామమూర్తికి (మాతృదేవోభవ సినిమాలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకు) లభించాయి.

    జాతీయ ఉత్తమ పాట అవార్డు కలాం చేతుల మీదుగా తీసుకుంటున్నప్పుడు కలాంతో lucky day to me అన్నాను. దానికి ఆయన కూడా mee to అన్నారట. ఆ మాట నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటారాయన. ప్రోగ్రాం కోసం కదులుదాం రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అనే పాట రాసినప్పుడు కేసీఆర్ ఆయన్ను పిలిపించుకుని తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అనే లైను హార్ట్ టచింగ్ బ్రదర్ అన్నారు అంటూ జీవితంలో మర్చిపోలేని ఘటనలను పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం దాదాపు 50 పాటలు రాశారు.

    English summary
    Gurajada Samskritika Samakhya, at its meeting , resolved to honour Suddala Asok Teja, noted lyric writer with ‘Gurajada Visista Puraskar’ on the evening of November 30.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X