»   »  ఆయన నాకు మంచి స్నేహితుడు: బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఇలా చెప్పింది

ఆయన నాకు మంచి స్నేహితుడు: బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఇలా చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుర్మిత్ బాబా కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే పాపం ఇప్పుడు 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన డేరా బాబా రామ్‌రహీం ఇకపై సినిమాలు తీయలేడు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా) బాబా వర్క్‌పర్మిట్‌ను రద్దు చేసింది. ఇంతేకాదు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టిడిఎ) రామ్ రహీంతో పాటు అతని కూతురుగా చెప్పుకుంటున్న హనీప్రీత్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.

ఈ మద్య ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువైన గుర్మీత్ రామ్ రహీం సింగ్ రేప్ కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నో అల్లర్లు చెలరేగాయి. ఒకదశలో గుర్మిత్ కి శిక్ష పడుతుందన్న విషయం తెలిసి చెలరేగిన అల్లర్లలో 31 మంది ప్రాణాలు విడిచారు..చాలా వరకు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది.

Gurmit Baba is a Good friend of Mine: Rakhi savanth

మొత్తానికి రేప్ కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ రేప్ కేసులో 20 సంవత్సరాల శిక్ష పడి ప్రస్తుతం ఈ బాబా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. అయితే కొంతకాలం కిదటి వరకూ రామ్ రహీంకు బాలీవుడ్‌లో మంచి పేరుంది. రామ్‌రహీంకు చెందిన ఒక సినిమా సక్సెస్ పార్టీలో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వేదికపై హంగామా చేసింది. రామ్‌రహీం దగ్గరకు వెళ్ళి అతనితో పాటు సెల్ఫీ తీసుకుంది.

బాబాకు శిక్ష పడిన తరువాత రాఖీసావంత్.. తనకు బాబా రామ్‌రహీం మంచి స్నేహితుడని పేర్కొంది. గణేశ్ మహరాజ్.. రామ్ రహీంకు విముక్తి కల్పిస్తే తనకు మంచి సినిమా ఛాన్స్ దక్కుతుందని చెప్పింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు శేఖర్ సుమన్, రుతిక్ రోషన్, శిల్పాశెట్టి, అనిల్ కపూర్, జాన్ అబ్రహం తదితరులతో రామ్ రహీం ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే సల్మాన్‌ఖాన్ సోదరుడు సోహెల్‌ఖాన్ కూడా రామ్‌రహీం పక్కన ఉన్న ఫొటో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.

English summary
Bollywood sexy Beauty Rakhi Savanth said Gurmit baba is a Good friend of Her
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu