»   » "గురు" మళ్ళీ మూడు నెలలు వాయిదా.... అసలేం జరుగుతోంది??

"గురు" మళ్ళీ మూడు నెలలు వాయిదా.... అసలేం జరుగుతోంది??

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా చిన్న సినిమాలు రకరకాల కారణాలతో వాయిదా పడుతుండడం చూస్తుంటాం. కానీ, ఈ మధ్య స్టార్‌హీరోల సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. అదీ నెలల పాటు వాయిదా పడుతున్నాయి. తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమా 'సింగం-3' షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ నెలలో విడుదల కావాల్సింది. చివరికి ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

సింగమ్ తమిళ సినిమా కాబట్టి పరవాలేదు గానీ స్టార్‌ హీరో వెంకటేష్‌ సినిమా 'గురు' కూడా వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. మాధవన్‌ హీరోగా నటించిన 'సాలా ఖాడూస్‌' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడో పూర్తయిపోయింది. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామనకున్నారు. అయితే సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీపడడంతో జనవరి 26న వద్దామనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా విడుదలను ఏకంగా మూడు నెలలు వాయిదా వేసేశారు. సమ్మర్‌ సీజన్‌ అయిన ఏప్రిల్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్‌ అయ్యారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్న నాటి నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ గా ఖ్యాతి గడించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం చాలా అరుదుగా సినిమా నిర్మాణాలు చేపడుతుంది. ఏడాదికి ఒక చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో విడుదల కానీ పరిస్థితిని చూస్తున్నాం. అయితే బాలీవుడ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన సాల ఖడూస్ చిత్ర రీమేక్ రైట్స్ దక్కించుకుని విక్టరీ వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో గురు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం నేడు(26 జనవరి) విడుదల చేయాల్సి ఉండగా కొన్ని రోజుల కిందట ఎటువంటి కారణాలు తెలుపకుండానే నిర్మాత సురేష్ బాబు గురు చిత్రాన్ని ఏకంగా మూడు నెలల పాటు వెనక్కి నెడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

బాబు బంగారంతో హిట్ కొట్టిన వెంకీ.. బాక్సింగ్ క్రీడ నేపధ్యంలో నటిస్తున్న సినిమా గురు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ ను సమ్మర్ కి వాయిదా వేసిందట చిత్రయూనిట్. నిజానికి ఎప్పుడో కంప్లీట్ అయిపోయిన ఈ సినిమా ఈ నెల 26నే రిలీజ్ చేయాలని భావించింది. అయితే నోట్ల రద్దు ప్రభావం, ఆ తర్వాత తెలుగు యంగ్ హీరోల సినిమాలు ఉండడంతో ఈ సినిమాను సమ్మర్ కి అంటే ఏకంగా మూడు నెలల పాటు వాయిదా పడటం అభిమానులకి తీవ్ర నిరాశ కలిగించే విషయం అనే చెప్పాలి..

English summary
Guru Telugu Movie Release Date Postponed recently by the film unit members due to some issues. As we all know that the Venky upcoming movie Guru was slated to hit the theaters on Republic day But Release Date Postponed To April month but they did not confirm the proper date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu