»   » గువ్వ గోరింక ఫస్ట్‌లుక్ ఇదే.., టీజర్ ప్రేమికుల రోజున

గువ్వ గోరింక ఫస్ట్‌లుక్ ఇదే.., టీజర్ ప్రేమికుల రోజున

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతీ ఏటా కొత్త ప్రేమకథ తో సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం ప్రేక్షకుని గుండెని తాకి జీవితాంతం గుర్తుండి పోతాయి. కారణం ఒక్క సీన్, ఒక్క డైలాగ్, లేదంటే ఆ ప్రేమకథ చుట్టూ ఉన్న ఏదో ఒక అంశమో ఉండి ఉంటుంది. అందుకే కొన్ని ప్రేమకథలలా గుర్తుండిపోతాయ్. కొన్ని ప్రేమగీతాలలా నోటిమీదే ఆడుతూంటాయ్. ఇప్పుడు వస్తూన్న గువ్వా గోరింక సినిమా కూడా అలాంటి ఒక సున్నితమైన ప్రేమకథ అవుతుందంటున్నారు ఆ చిత్ర యూనిట్. ఒక అందమైన ప్రేమ కథ తో వస్తున్న గువ్వ గోరింక సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను శుక్ర‌వారం విడుదలయ్యింది.

Guvva gorinka

స‌త్య‌, ప్రియాలాల్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టి సినిమా పూర్తి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. దర్శకుడు మోహ‌న్ బ‌మ్మిడి తెలిపాడు. ఫిబ్ర‌వ‌రి 14న టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. దాము కొస‌నం, ద‌ళం జీవ‌న్ రెడ్డిలు నిర్మిస్తున్నఈ సినిమాకు సంగీత దర్శకుడు బొబ్బిలి సురేష్ అద్బుతమైన ట్యూన్లు కంపోజ్ చేసినట్టు సమాచారం.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు చిత్ర విశేషాలు తెలియ‌జేస్తూ 'విభిన్న మ‌న‌స్త‌త్వం క‌లిగిన ఇద్ద‌రు ప్రేమికుల క‌థ ఇది. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను ప్రేమికుల రోజున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ హైద‌రాబాద్‌, అన్న‌వ‌రం, వ‌రంగ‌ల్‌ల‌లో జ‌రిగిన షూటింగ్‌తో 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ పూర్త‌యింది. కొత్త త‌ర‌హా సినిమాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు వినూత్న అనుభూతిని పంచుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది' అని తెలిపారు.

gorinka

చైతన్య, మధుమిత, పెళ్లిచూపులు ప్రియదర్శి, ఈటీవీ ప్రభాకర్, ఫిష్ వెంకట్, సత్య ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, డీఓపీ: మైల్స్ రంగస్వామి

English summary
Guvva Gorinka an upcoming Love story By Director Mohan Bammidi First look is released and Teaser Willbe out on Feb 14th
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu