»   »  ప్రేమికుల కోసం ఒక వాలంటైన్స్ డే గిఫ్ట్: గువ్వ గోరింక టీజర్

ప్రేమికుల కోసం ఒక వాలంటైన్స్ డే గిఫ్ట్: గువ్వ గోరింక టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
జ్యోతిలక్ష్మి మూవీలో కనిపించిన స‌త్య‌, ప్రియాలాల్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న గువ్వ గోరింక చిత్రం ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టి సినిమా పూర్తి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. దర్శకుడు మోహ‌న్ బ‌మ్మిడి తెలిపాడు. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత సత్య దేవ్ పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ని ఈరోజు ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేసారు

దాము కొస‌నం, ద‌ళం జీవ‌న్ రెడ్డిలు నిర్మిస్తున్నఈ సినిమాకు సంగీత దర్శకుడు బొబ్బిలి సురేష్ అద్బుతమైన ట్యూన్లు ఇచ్చాడు అనే టాక్ ముందు నుంచే వినిపిస్తున్నా అంతగొప్పగా ఏముంటుంది లే అనుకున్నవాళ్ళే ఎక్కువ అయితే... ఒక్క సారి అందరి అంచనాలూ తలకిందులయ్యేటట్టే ఉన్నాయి.

Guvva Gorinka teaser released

ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు వచ్చిన గువ్వాగోరింక టీజర్ చూస్తే ఖచ్చితంగా ఒక అద్బుతమైన ఫీల్ ఉండే లవ్‌స్టోరీ మరింత అందంగా, చక్కటి మ్యూజిక్ తో రానుందన్న విషయం అర్థమైపోతుంది. విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ అందరిని అలరిస్తోంది. జ్యోతిలక్ష్మీ ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఆకార్ మూవీస్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకత్వంలో తెరకెక్కుతున్నది.

ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్, అన్నవరం, వరంగల్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ రోజు వచ్చిన టీజర్ సినిమా మీద మరిన్నిత అంచనాలను పెంచుతుందనటం లో ఏమాత్రం సందేహం లేదు... 38 సెకెన్ల టీజర్ లో వినిపించే హమ్మింగ్ మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఆ కొద్ది సేపట్లోనే తానేం చూపించబోతున్నాడో చెప్పేసాడు దర్శకుడు. హీరోయిన్ లుక్ సూపర్ అనుకుంటే హీరో మరింత బాగా ఆకట్టుకున్నాడు.

English summary
Guvva Gorinka Team released a Teaser Today as a valentine's day Guift., Telling the love story of two individuals with two distinct mindsets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu