»   »  అలా ఐలవ్యూ చెప్పా : సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్

అలా ఐలవ్యూ చెప్పా : సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  GV Prakash - Saindhavi Love Story
  హైదరాబాద్ : సంగీత దర్శకుడుగా, రెహమాన్‌ మేనల్లుడు జీవీ ప్రకాష్, 'సూటిగా చూడకు...', 'ప్రేమదేశం యువరాణి'... వంటి ప్రేమ గీతాలు పాడిన గాయని సైంధవిని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పన్నేండేళ్ల క్రితం మొదలైన తమ ప్రేమని పెళ్లి పీటలెక్కించి గెలిపించుకున్నారు. ఈ సందర్భంగా జీవి ప్రకాష్ తన ప్రేమ కథ ఎలా మొదలైందో మీడియాకు తెలియచేసారు.

  ఆయన మాటల్లోనే... సైంధవి... తీయని పాటల కోయిలగానే నాకు మొదట తెలుసు. నేను పదోతరగతిలో ఉండగా తనని చూశా. అప్పుడు ఇద్దరం చెన్నైలోని చెట్టినాడ్‌ స్కూల్లో చదువుతున్నాం. తనప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. చిన్నప్పట్నుంచీ సంగీతం అంటే పిచ్చి కనుక స్కూల్లోనే మ్యూజిక్‌ బ్యాండు నడుపుతుండేవాణ్ని. స్కూల్లో ఏ మాత్రం బాగా పాడేవాళ్లు ఉన్నారని తెలిసినా వారిని నా బ్యాండులో చేర్చుకునేవాణ్ని. అలా ఓసారి సైంధవి పాడడం విన్నా. ఆ గొంతుకే మొదట పడిపోయా అన్నారు.

  అలాగే ఆమె పాట వింటుంటే నన్ను నేనే మర్చిపోయా. చక్కటి అమ్మాయి... తియ్యని గొంతుతో కనిపిస్తే ఇక మనసు ఆగుతుందా... వెంటనే మా బ్యాండులో చేరమని అడిగా. అప్పట్నుంచి కలిసి మాటలూ, పాటలూ మొదలయ్యాయి. స్కూల్లో ఏ పోటీ అయినా మా బృందమే గెలిచేది. సగం సైంధవి గొంతుకే జడ్జిలు పరవశించిపోయేవారు. తను పాడుతుంటే నన్ను నేనూ మర్చిపోయేవాణ్ని. తన పాటే కాదు, మాట కూడా నా గుండెని తియ్యగా తాకేది. ఎప్పుడూ తనతో మాట్లాడాలనిపించేది. ఏదోలా మాట కలపడానికే ప్రయత్నించేవాణ్ని. మాట్లాడే పని లేకపోయినా ఏదో వంకతో తనూ ఫోన్‌ చేసేది. దీనిని బట్టి సైంధవి కూడా నన్ను ఇష్టపడుతోందన్న నమ్మకం కలిగింది అన్నారు.

  ఇక స్కూలు ప్రేమల్ని ఎక్కువ మంది నమ్మరు. కానీ నాకు నమ్మకముంది... నాది నిజమైన ప్రేమని. అందుకే పదో తరగతిలో ఉండగానే తనకి చెప్పాలనుకున్నా. అయితే తను నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఓ రోజు మేం కలిసినప్పుడు మాటల మధ్యలో నన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పేసింది. ఆశ్చర్యపోయా...! నేను ప్రపోజ్‌ చేద్దామనుకుంటే వూహించని రీతిలో తనే నాకు మనసులో మాట చెప్పింది. ఆలోచించి చెబుతా అని వెళ్లిపోయా. రెండో రోజే వెళ్లి ఒక చిన్న టెడ్డీబేర్‌ చేతిలో పెట్టా. దానిని తను చేత్తో తాకగానే 'ఐ లవ్‌ యూ' అని వినిపించింది. అలా నా ప్రేమని చెప్పా అని చెప్పుకొచ్చారు.

  సైధంవి మాట్లాడుతూ... కొన్ని రోజులు 'హాయ్‌' వరకే పరిమితమయ్యా. కలిసి పాటలు ప్రాక్టీసు చేస్తున్న కొద్దీ పరిచయం పెరిగింది. స్కూల్లో ఎక్కువ సమయం నాతో ఉండడానికే ఇష్టపడేవాడు. అందరిలో నన్ను ప్రత్యేకంగా చూడడం, ఓ కంట కనిపెడుతూనే ఉన్నా. అప్పుడప్పుడు అనిపించేది... జీవీ నన్ను ఇష్టపడుతున్నాడేమో అని. తన చూపూ, నవ్వూ, నడకా, మాటతీరూ, నాకిచ్చే గౌరవం... అన్నీ ప్రేమని చెప్పకనే చెప్పేవి. నాకూ తనంటే ఇష్టం. అలాంటప్పుడు ఎక్కువ కాలం ఆగాలనిపించలేదు. మనసులో మాట చెప్పేయాలనిపించింది. అయినా ఎక్కడో ఓ మూల భయం. నేను చెప్పాక తను 'నో' అంటే ఏంటి పరిస్థితి అని! స్నేహం కూడా దక్కదేమో... అన్న సందేహం. అయినా ఓ రోజు ధైర్యం చేశా. జీవీ స్కూల్‌కి రాగానే దగ్గరికి వెళ్లా. తను ఏదో మాట్లాడుతుండగా... 'నువ్వంటే ఇష్టం...' అని చెప్పేశా. ఏం మాట్లాడకుండా, రెండు నిమిషాలు నన్నే చూశాడు. నాకు భయంతో ఏడుపొచ్చేసింది. 'నాకు వారం రోజులు టైమివ్వు' అన్నాడు. రెండో రోజే ఒప్పేసుకున్నాడు.


  ఆ రోజు నుంచి ప్రేమ పక్షులమయ్యాం. స్కూల్లో ఉన్నప్పుడు మేం బయట కలిసేది చాలా తక్కువ. ఎప్పుడో స్నేహితులతో పాటు కలవడమే తప్ప. ఇంటర్‌ పూర్తి చేశాక అప్పుడప్పుడూ బయట కలవడం ప్రారంభించాం. అది కూడా చాలా తక్కువగా. ప్రేమ మా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. మా ఇద్దరి మధ్యా మాత్రమే ఉండాల్సింది. అందరికీ తెలియడం మాకిష్టం లేదు. అందుకే జీవితంలో స్థిరపడ్డాక, మంచి పేరు సాధించాకే పెళ్లి చేసుకోవాలనీ, ప్రేమని ప్రపంచానికి తెలపాలనీ నిర్ణయానికొచ్చాం. అందుకే పన్నెండేళ్లు ప్రేమించుకున్నా... మా విషయం అందరికీ తెలిసింది నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందే అని వివరించారు.

  English summary
  Though the whole world knows that the two big names of the music industry is in an enviable relationship, many do not know how the love sparked between music composer GV Prakash and singer Saindhavi. Seems like teddy bears did the magic. The music director broke the holy secret recently, when he said that he wooed his lady love, by gifting her, her favourite, teddy bears. The two, who were schoolmates, started seeing each other when GV Prakash was in class 10 and Saindhavi in the 8th. Since Prakash was interested in Saindhavi, he gifted her a couple of teddy bears which chanted 'I love you', when pressed - a simple yet powerful gift. And hence started rotating their wheel of love.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more