»   » జివి ప్రకాష్ రిసెప్షన్లో స్టార్స్ సందడి (ఫోటోలు)

జివి ప్రకాష్ రిసెప్షన్లో స్టార్స్ సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సంగీత దర్శకుడు జివి ప్రకాష్ వివాహం సింగర్ సైంధవి వెడ్డింగ్ రిసెప్షన్ గురువారం సాయంత్రంతో చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. సినీ రంగానికి చెందిన ప్రముఖుల రాకతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది. టోటల్ తమిళ సినీ పరిశ్రమ మొత్తం ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించింది.

జివి ప్రకాష్-సైంధవి మ్యారేజ్ రిసెప్షన్ చెన్నై నగరంలోని ఎంఆర్‌సి నగర్లో గల మేయర్ రామనాథన్ చెట్టియార్ హాలులో జరిగింది. అంతకు ముందు ఉదయం 10.25 గంటలకు వీరి వివాహ మహోత్సవం బంధువులు, సన్నిహితుల మధ్య ఎంతో వైభవంగా జరిగింది.

వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారిలో దర్శకుడు కె.బాలచందర్, భార్య సంగీతతో కలిసి హీరో విజయ్, మనోబాల, ప్రసన్న మరియు స్నేహ, దయానిధి మారన్, అమలా పాల్, భరద్వాజ్, ఎంకె స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, శంకర్, ఏఆర్ రెహమాన్, అమీర్ సుల్తాన్, చేరన్, ఎఎల్ విజయ్, లింగుస్వామి, హీరో కార్తి, వెట్రిమారన్, విజయ్ ఆంటోని, హారిస్ జైరాజ్, ఎడిటర్ ఆంటోని, ఎస్‌పి ముత్తురామన్, వెంకట్ ప్రభు, ధనుష్, జయం రాజా, ఆర్య, గంగై అమరన్, దురై దయానిధి, జీవా, దర్శకుడు విష్ణువర్ధన్, లతా రజనీకాంత్, శాలిని అజిత్, శామిలి, భారతి రాజా, దయానిధి అజగిరి, వి సెల్వగణేషన్ తదితరులు....

స్లైడ్ షోలో వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు, అతిథుల వివరాలు

అజయన్ బాల, జెఎస్‌కె సతీష్, చంద్రప్రకాష్ జైన్, జి వెంకట్రామ్, డమ్స్ శివమణి, అధర్వ, విద్యా సాగర్, శ్యామ్, ప్రేమ్ జి అమరన్, డాన్స్ మాస్టర్ రఘురామ్, గాయిత్రి రఘురామ్, చిన్ని జయంత్, శ్రీకాంత్ తదితరులు కూడా హాజరయ్యారు.

ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ మాధన్, హరి చరణ్, నరేష్ లైర్, హరిష్ రాఘవేంద్ర, చింబుదేవన్, ఎల్రెడ్ కుమార్, రవి కె చంద్రన్, వసంత బాలన్, నా ముత్తుకుమార్, కలైపులి ఎస్ థాను, ఆర్ పార్థిబన్ తదితరులకు ఉన్నారు.

జివి ప్రకాష్, సైంధవి దాదాపు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎట్టకేలకు జూన్ 27న వీరి వివాహం జరిగింది. వివాహ వేడుక అనేది కలకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.

జివి ప్రకాష్-సైంధవి వివాహం గురువారం ఉదయం 10.25 గంటలకు గ్రాండ్ గా జరిగింది. జివి ప్రకాష్ ఎవరో కాదు...ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడు

దర్శకుడు బాలు మహేంద్ర, మణిరత్నం, సుహాసిని, రాజీవ్ మీనన్, దర్శకుడు బాల, దర్శకుడు కె. భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్, సూర్య, విజయ్ మదర్ శోభచంద్రశేఖర్, విజయ్ వైఫ్ సంగీత, ఎఎల్ అళగప్పన్, దర్శకుడు ఎఎల్ విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవా తదితరులు వివాహానికి హాజరయ్యారు.

శంతను, పుష్కర్ మరియు గాయిత్రి, ధన్సిక, పా విజయ్, ఎల్ఆర్ ఈశ్వరి, నిత్యశ్రీ మహదేవన్, ధనంజయన్ గోవిందన్, కమలా సెల్వరాజ్, క్రేజీ మోహన్ లాంటి ప్రముఖులు కూడా వివాహానికి హాజరయ్యారు.

పెళ్లి సందర్భంగా జివి ప్రకాష్, సైంధవి సాంప్రదాయ దుస్తులు ధరించారు. జివి ప్రకాష్ వైట్ ధోతి, చొక్కా ధరించగా, సైంధవి కాంజీవరం సిల్కు సారీ ధరించింది. సాంప్రదాయ దుస్తుల్లో వారు ఎంతో అందంగా కనిపించారు.

ప్రకాష్-సైంధవి మధ్య చిన్ననాటి నుండే స్నేహం ఉంది. ఆ స్నేహమే తర్వాత ప్రేమగా మారింది. గత డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ పనుల బిజీ వల్ల లేటయింది.

సైంధవి-ప్రకాష్ పెళ్లి తర్వాత హనీమూన్ ఎంజాయ్ చేసేందుకు ఆస్ట్రేలియా వెలుతున్నారు. కొన్నివారాలు అక్కడ గడిపిన తర్వాత తిరిగి చెన్నై రానున్నారు.

జివి ప్రకాష్ చిన్న వయసులోనే సంగీత దర్శకుడయ్యారు. పక్కా ప్రొఫెషనల్. అందుకే తమిళంతోపాటు, తెలుగు, హిందీ చిత్ర సీమల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

జివి ప్రకాష్ తర్వాతి ప్రాజెక్టుల విషయానికొస్తే....ఎక్కువగా తమిళ చిత్రాలే ఉన్నాయి.

సైంధవి విషయానికొస్తే తెలుగులో ఆమె మామిడి కొమ్మకి... (ఆవకాయ బిర్యాని), ఎలగెలగ(పరుగు) చిత్రాలుకు పాడింది. ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ గాయనిగా గతంలో సత్కరించింది కూడా.

English summary
It was an evening where bigwigs from Kollywood and music World were in full numbers to wish the newly married couple, GV Prakash Kumar and Saindhavi. The wedding reception marked the attendance of the popular celebrities of Tamil film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu