‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ బావుంది...
అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.
హైదరాబాద్: అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం 'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.
ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ రచించిన 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా యూత్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
బాలాజీ మోషన్ పిక్చర్స్, ఎఎల్‌టి ఎంటర్టెన్మెంట్ బేనర్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి, సీమా బిస్వాస్, విక్రాంత్ మాసే, ఫెలిక్స్ శింద్రాజ్ నటిస్తున్నారు. మే 19, 2017న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
More from Filmibeat
half girlfriend mohit suri arjun kapoor shraddha kapoor హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మోహిత్ సూరి అర్జున్ కపూర్ శ్రద్ధా కపూర్


Click it and Unblock the Notifications












