»   »  హంసానందినికి కారుకి యాక్సిడెంట్...క్షేమం

హంసానందినికి కారుకి యాక్సిడెంట్...క్షేమం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హంసానందిని అదృష్టవంతురాలే. ఆమెకి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు కారులో ప్రయాణిస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో టైర్ పంక్చర్ అయింది. దీంతో అదుపుతప్పిన వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం నుంచి హంసానందిని క్షేమంగా బయటపడింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యక్తులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... మిర్చి, అత్తారింటికి దారేది సినిమాల్లో ఐటం సాంగ్ లలో నటించిన ప్రముఖ సినీనటి హంసానందినికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. సోమవారం ఆమె కుటుంబసభ్యులతో కడప నుంచి హైదరాబాద్‌కు వాహనంలో బయలుదేరారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రం మునిరంగస్వామి ఆలయసమీపంలోకి రాగానే వీరి వాహనం టైరు పగిలి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది.

Hamsa Nandini met with an accident

డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్దప్రమాదం జరుగకుండా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హంసానందిని కాలుకు స్వల్ప గాయమైంది. మరో వాహనంలో వాళ్లు వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదుకాలేదు. సిని పరిశ్రమలోని ఆమె ఆప్తులు ఆమెకు ఫోన్ చేసి పరామర్శలు చేస్తున్నారు.

అనుమానాస్సదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నాపెళ్లంట, నా ఇష్టం, టీ-సమోసా-బిస్కెట్, ఈగ, మిర్చి, భాయ్,అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో నటించి మంచి ఊపుమీదా ఉంది. తెరపై కొద్దిసేపు కనిపించినా యూత్ కి పిచ్చెక్కిస్తోంది. 'మిర్చి'లోని 'మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చీ లాంటి కుర్రాడే' పాటకు హంసా డాన్స్ చేసిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. అదే జోరుతో 'భాయ్' చిత్రంలో నాగార్జున సరసన ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌తో ప్రత్యేక పాటకు కాలు కదిపింది. ఇప్పుడు హంసా 'రుద్రమదేవి'లో ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది.

English summary
Hamsa Nandini met with an accident and she is safe. Hamsa Nandini who predominantly works in South Indian cinemas. She made her debut in the Telugu film industry with the movie Anumanaspandam (2007) for which she received positive feedback and praises from her fans. Her cameo performances in movies like ‘E
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu