»   » రక్తంతో సంతకం చేసి ఇచ్చారు : హన్సిక

రక్తంతో సంతకం చేసి ఇచ్చారు : హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : హన్సిక ...తెలుగు,తమిళ భాషల్లో వరసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్. ఆమెకు ఇప్పడు మాత్రమే కాదు..చిన్నప్పుడు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదిట. అప్పట్లో ఆమెకు రక్తంతో రాసిన ప్రేమ లేఖలు వచ్చేవని చెప్తోంది. ఈ విషయమై ఆమె మీడియాతో ముచ్చటించింది.

హన్సిక మాట్లాడుతూ.... మా పాఠశాలలో అంతా కోటీశ్వరుల పిల్లలే. నేను బాలనటిగా ప్రాచుర్యం పొందటంతో ప్రత్యేకంగా చూసేవారు. ఒకరోజు పది మంది అబ్బాయిలు మా స్కూల్‌ గేట్‌ వద్ద నిమిషాల తరబడి వేచి ఉండటాన్ని టీచర్‌ గమనించింది. కారణం అడిగితే.. హన్సికను చూడాలని సమాధానమిచ్చారు. వారందరిని ఒకచోట చేర్చి మాట్లాడమని నన్ను పంపించారు. కాసేపు మాట్లాడి వెళ్తూ వెళ్తూ ప్రేమలేఖలు చేతిలో పెట్టారు. 'ఐ లవ్‌ యూ హన్సిక' అని రాసి రక్తంతో సంతకం చేశారు. చిన్న వయసులోనే నాకు అంతటి ఫాలోయింగ్‌ ఉండేది అంది.

'సింగం-2'లో స్కూల్‌ విద్యార్థినిగా నటిస్తున్నారు కదా... సూర్యతో స్కూల్‌ అనుభవాలు పంచుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ.... లేదు. షూటింగ్ లో ....తన సీన్ పూర్తయిన వెంటనే ఆయన పక్కకు వెళ్లి కూర్చుంటారు అంది.

ఇక డ్యూయిట్స్, లవ్ సీన్స్ కే పరిమితమవుతున్నారు. ఒకే తరహా పాత్రలపై మొహం మొత్తలేదా అంటే... నా వయసుకు, రూపానికి ప్రేమపాత్రలే కచ్చితంగా నప్పుతాయి. దర్శకులు కూడా అలాంటి వాటినే ఇస్తున్నారు. ప్రస్తుతం నా వయసు 21. వయసు పెరిగేకొద్దీ, సమయం వచ్చినప్పుడు వైవిధ్య పాత్రలకు కూడా ప్రాముఖ్యత ఇస్తాను అంది.

English summary

 Hot Hansika revels that she recieves many love letters in her school Days. She also says that some love letters are written by Blood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu