For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోతో ముద్దు మురిపాలతో.. దొరికిపోయిన హాట్ హన్సిక (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: హన్సిక, కార్తీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బిర్యాని'. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో హన్సిక జర్నలిస్ట్ గా కనిపించనుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించి స్టిల్స్ విడుదల చేసారు. అవి అభిమానులను ఓ రేంజిలో ఆకర్షిస్తున్నాయి.

  ఈ చిత్రం గురించి హన్సిక మాట్లాడుతూ.... ''నా అదృష్టం కొద్దీ రానున్న అన్నీ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తున్నాను. నాకు జర్నలిస్ట్ వృత్తి అంటే చాలా గౌరవం. ఒక్క సినిమాలోనైనా జర్నలిస్ట్‌గా కనిపించాలనేది నా ఆశ. త్వరలో ఆ కోరిక కూడా తీరబోతోంది. కార్తీ 'బిర్యాని' చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే 'ది బెస్ట్' అనదగ్గ కేరక్టర్ అది'' అంటూ ఆనందం వ్యక్తం చేశారు హన్సిక.

  ప్రస్తుతం హన్సిక నటించిన ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయిదు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో మూడు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాట హన్సిక ట్రాక్ రికార్డ్ ఇది.

  హన్సిక అందాల బిర్యాని.. స్లైడ్ షోలో

  హన్సిక క్రమశిక్షణ, సమయపాలన చూసి అవాక్కవ్వడం తమిళ నిర్మాతల వంతవుతోంది. అదే ఆమెకు ప్లస్ అవుతోంది.

  కోలీవుడ్‌లో హన్సిక ప్రభ ఓ రేంజిలో వెలిగిపోతోంది. ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే... ఇంత బిజీలో కూడా ఏ సినిమా వల్లా మరో సినిమాకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని షూటింగుల్లో పాల్గొంటోంది హన్సిక.

  ఓ తమిళ చానల్‌కి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో హన్సిక మాట్లాడుతూ - చాలా విసుగ్గా ఉంది. విశ్రాంతి లేకుండా షూటింగుల్లో పాల్గొనడంవల్ల ముందు అలసిపోతున్నాను. అందుకే... కొన్ని రోజులు ఈ షూటింగులకు విరామం ఇచ్చేద్దాం అను కుంటున్నా అంది.

  ఏప్రిల్ నెలాఖరు వరకు రెస్ట్ లేకుండా షూటింగుల్లో పాల్గొని సినిమాలన్నీ పూర్తి చేసేస్తా. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు షూటింగులకు బ్రేక్. ప్రశాంతంగా హాలీడేస్‌ని ఎంజాయ్ చేసి, మళ్లీ షూటింగుల్లో పాల్గొంటా'' అని హన్సిక చెప్పింది.

  బిర్యానిలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

  ముద్దు సన్నివేశాలు విషయమై కార్తీ మాట్లాడుతూ.. 'బిరియాని' చిత్రంలో నా పాత్ర రొమాంటిక్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ అదేది నిజం కాదు అన్నారు.

  ఒక వేళ ముద్దు సన్నివేశాల్లో నటించాలంటే నేను చెయ్యను. నాకు పెళ్లి అయిపోయిందని చెబుతాను అని నవ్వుతూ చెప్పారు.

  అంతేకాదు... ముద్దు సన్నివేశాల్లో నటిస్తానని నా భార్య దగ్గర అనుమతి కోరడం కూడా కష్టమే. ఏ దర్శకుడైనా ముద్దు సీన్‌లు తప్పదు అంటే గ్రాఫిక్స్‌లో చేసేయ్యమంటాను అని చెప్పుకొచ్చారు కార్తీ.

  బిర్యానీ ఇప్పటికే తమిళ మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించింది.

  హన్సిక తెలుగులో ఒక్క సినిమా కూడా చేతులో లేకపోయినా చాలా ఉత్సాహంగా త్వరలో కనపడుతాను అంటోంది.

  "నాకు అప్పగించిన పనులను త్రికరణశుద్ధిగా చేసుకుపోవడమే నాకు తెలుసు. ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది. మనం చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించిందని సంతోషిస్తాను'' అని హన్సిక చెప్పింది.

  'దేశముదురు' నుంచి 'దేనికైనా రెడీ' వరకూ తెలుగులో పలు చిత్రాలు చేసింది ముంబై భామ హన్సిక. ఇప్పుడు తమిళంలోనూ బిజీ అయ్యిపోయింది.

  English summary
  We will have Karthi and Hansika serving Biryani under hot sun. The first look of the posters of Biriyani are out and they look really kewl. Biryani is an upcoming bilingual (Telugu/Tamil) comedy film written and directed by Venkat Prabhu. KE Gnanvelraja producing this film under his Studio Greens banner.Yuvan Shankar Raja is composing the music. Interestingly this is 100th film of yuvan Shankar Raja who has given 900 tracks so far.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X