»   » నన్ను చూసి నవ్వుకునే వారికి పిచ్చిపట్టింది.....హన్సిక

నన్ను చూసి నవ్వుకునే వారికి పిచ్చిపట్టింది.....హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హన్సిక గుర్తుందా కోంత కాలం క్రితం 'దేశముదురు" సినిమాలలో కులు, మనాలిలో దర్శనం ఇచ్చి కుర్రకారును ఆకట్టుకున్న ఈ అందాల బోమ్మను కోందరు చూసి నవ్వుకున్నారు. ఈమెకు పిచ్చి పట్టింది అనుకున్నారు. అదేమిటంటే సినిమా షూటింగ్ స్పాట్ కు రాగానే హన్సిక చేసే మొదటి పని కెమెరాకు నమస్కారం చేయడం. ఆ విధంగా చేసినప్పుడు లైట్ బాయ్ నుండి కోందరు అసిస్టెంట్ డైరెక్టర్ లు నవ్వుకున్న రోజులు వున్నాయని 'హన్నిక' అంటున్నారు.

అయితే ఇలాంటి విషయాలు నేను పట్టించుకోను అంటున్నారు. నాకు చిన్నప్పటి నుండి సినిమాలు ఇష్టం. నా జీవితం సినిమాలతో ముడిపడింది. నేను ఎప్పుడు రెడీ...క్లాప్....కట్ అంటు వింటుండాలి. ఆ సమయంలో నాఆనందం చెప్పలేనిది. నాదృష్టిలో సినిమా వారికి 'కెమెరా" దేవుడితో సమానం అందుకే 'నమస్కారం" పెట్టుకుంటాను. దాన్ని చూసి నవ్వుకునే వాళ్లకు పిచ్చి అంటున్నారు హన్సిక. తాను సినిమాలో నటిస్తు ఆనందంగా వున్నానని నాకు మంచి రోజులు వస్తాయని అంటున్నారు. హన్సిక షూటింగ్ స్పాట్ లో ఏంతో సిన్సియర్ గా వుంటారని ఆమె ప్రవర్తన గమనించిన కోందరు ఇంతకు ముందే చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu