»   » హన్సిక కొవ్వు తగ్గించిన మంచు సినిమా

హన్సిక కొవ్వు తగ్గించిన మంచు సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : త్వరలో హన్సిక ...పూర్తిగా సన్నబడ్డ రూపంలో కనపించి అలరించనుంది. అయితే హన్సిక తనకు తానుగా సన్నబడలేదట. ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాలో కాస్త నాజూగ్గా కనబడాల్సి వచ్చిందట. ఆ విషయాన్ని దర్శకుడు చెప్పడంతో కొన్ని నియమాలు పాటించి తక్కువ రోజుల్లోనే మెరుపు తీగలా తయారైందట. మంచు ఫ్యామిలీ సినిమాగా వస్తున్న ఓ కుటుంబ కథా చిత్రం కోసం ఆమె ఇలా సన్నబడింది. మంచు సినిమా పేరు చెప్పి ఆమె కొవ్వు తగ్గించుకోని ఇలా కనపడటం ఆమె అబిమానులకు ఆనందం కలిగిస్తోంది.

మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వరుణ్‌సందేశ్‌, తనీష్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హన్సిక, ప్రణీత, రవీనాటాండన్‌ హీరోయిన్స్. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో హన్సిక ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఆ పాత్రలో నాజూగ్గా కనిపిస్తేనే బాగుంటుందని దర్శకుడు చెప్పాడట. దీంతో వెంటనే సన్నబడింది హన్సిక.

ఈ చిత్రంలో దాసరి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం. దాసరి- మోహన్‌బాబుల మధ్య గురుశిష్యుల సంబంధం ఉంది. ఆ అనుబంధంతోనే దాసరి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారని తెలిసింది. టైటిల్ ఖరారు కాని ఈచిత్రం బాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసిన గోల్ మాల్ 3కి రీమేక్ అని సమాచారం. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మోహన్ బాబుకు జోడీగా బాలీవుడ్ నటి రవీనా టండన్ నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీమోహన్, కోన వెంకట్, బివిఎస్ రవి స్క్రిప్టు అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి, బప్పీ లహరి, ఆచ్చు, బాబా సెహగల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ భామ ప్రస్తుతం తన ప్రియుడు శింబుతో కలిసి తమిళంలో రెండు చిత్రాలు చేస్తోంది. బొద్దుగా కనిపిస్తూ కుర్రకారును మురిపిస్తుంటుంది హన్సిక. అందుకే ఈ ముద్దుగుమ్మని తమిళ జనాలు జూనియర్‌ ఖుష్బూ అని పిలిచుకొంటుంటారు. ఈ పాల బుగ్గల భామ ఇప్పుడు సన్నబడింది. కందిరీగ నడుముతో నాజూగ్గా తయారైంది. మరి తమిళంలో ఏమన్నా సమస్య అవుతుందేమో చూడాలి అంటున్నారు.

English summary
Stop her critics from tch-tching about her increasing weight once and for all, Hansika we hear plans to shed lots of weight and come back looking svelte. It's always a good idea to get into shape. The Dhenikaina Ready movie pair Vishnu Manchu and Hansika are set to team up again for a film to be directed by Srivas. The duo has already begun shooting for this film and they have completed a song shoot earlier in the beautiful locales of Slovenia and Italy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu