»   » అసభ్యంగా : గోవాలో హన్సికకు షాకింగ్ అనుభవం

అసభ్యంగా : గోవాలో హన్సికకు షాకింగ్ అనుభవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోవా: హీరోయిన్ హన్సిక గోవాలో షాకింగ్ అనుభవం ఎదుర్కొంది. అభిమానుల పేరుతో ఆమె వద్దకు వచ్చిన కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనతో హన్సిక ఒక్కసారిగా షాకయిది.

తెలుగు, తమిళంలో ఒకే సారి తెరకెక్కుతున్న ఓ చిత్రం షూటింగు కోసం హన్సిక గోవా వెళ్లింది. హీరో సిద్ధార్థ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సిద్ధార్థ్-హన్సిక మధ్య సాయంత్రం 4 గంటల సమయంలో ఓ బీచ్ వద్ద సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఇంతలో కొందరు వ్యక్తులు సినిమా సెట్లోకి ఎంటరయ్యారు. హన్సిక అభిమానులమంటూ ఆమె వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఒంటిపై చేయి వేసారు. దీంతో హన్సిక వెంటనే వారిని తోసేసింది.

ఈ విషయాన్ని గమనించిన యూనిట్ సభ్యులు సదరు ఆకతాయిలను అక్కడి నుండి తరిమికొట్టే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో వారు యూనిట్ సభ్యులతో గొడవ పడ్డారు. ఈ సంఘటనతో హన్సిక, యూనిట్ సభ్యులు అప్ సెట్ అయ్యారు. ఆ రోజు షూటింగును ఆపేసారు.

హన్సిక సర్‌ప్రైజ్

హన్సిక సర్‌ప్రైజ్

గోవా లాంటి ప్రదేశంలో తనను పలువురు గుర్తించడంపై హన్సిక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తొలుత ఆమె ఇక్కడి వారు తనను గుర్తించరేమో అని భావించింది.

బాల నటిగా హన్సికకు గుర్తింపు...

బాల నటిగా హన్సికకు గుర్తింపు...

హన్సిక పలు హిందీ చిత్రాల్లో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. అందుకే అక్కడి పీపుల్ ఆమెను గుర్తించారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటనపై ఆమె చాలా డిసప్పాయింటుకు గురయ్యారు.

హన్సిక

హన్సిక

ఈ సంఘటన తర్వాత యూనిట్ సభ్యులు ఆ ప్రదేశం నుండి వెళ్లి పోయి మరొక ప్రదేవంలో సాంగు చిత్రీకరణ జరిపారు.

హన్సిక ఇబ్బంగా ఫీలైంది

హన్సిక ఇబ్బంగా ఫీలైంది

ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో మళ్లీ షూటింగు జరుపడంపై హన్సిక ఇబ్బంది ఫీలవ్వడంతో యూనిట్ సభ్యులు మరో ప్రదేశంలో షూటింగ్ ప్లాన్ చేసారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఈ సంఘటనపై యూనిట్ సభ్యులు గోవా పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న సినిమా విషయానికొస్తే ఈ చిత్రం పేరు ‘ఉయ్‌రే ఉయ్‌రే'. నటి జయప్రద-పొలిటీషియన్ అమర్ సింగ్ నిర్మిస్తున్నారు. విక్రమ్ కుమార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులోనూ ఈచిత్రం విడుదల కానుంది.

English summary

 Hansika Motwani could not have expected people to behave in such a manner, as she was molested in Goa. The actress, during the shooting of her forthcoming movie, had a bad experience in the Tourtist's Heaven of India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu