»   » హన్సికకు బంపర్ ఛాన్స్....‘సంఘమిత్ర’గా?

హన్సికకు బంపర్ ఛాన్స్....‘సంఘమిత్ర’గా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్‌లో బాహుబలి తరహాలో 'సంఘమిత్ర' అనే భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత శృతి హాసన్ ను అనుకున్నారు. పలు కారణాలతో ఈ సినిమా నుండి శృతి తప్పకుంది. ఇపుడు ఈ అవకాశం హన్సికకు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇంకా ఫైనల్ కాలేదని చిత్ర యూనిట్ చెబుతున్నమాట.

ఇంతకు ముందు ఈ చిత్రానికి అనుష్క, నయనతారల పేర్లు వినిపించాయి. అయితే వారి డేట్స్ ఖాళీ లేక పోవడంతో హన్సిక వైపు దర్శక నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు టాక్. అయితే హన్సికకు ఈ రోల్ అంతగా సూటవ్వదని, ఆమె కత్తిసాము లాంటివి చేయలేదని కొందరి వాదన.

Hansika not yet finalised for 'Sanghamitra'

దీంతో దర్శకుడు సుందర్‌.సి ఆమె ఈ పాత్రకు ఏ మేరకు సెట్టవుతుందని టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో సుందర్ సి దర్వకత్వంలో 'అరణ్మనై', 'అరణ్మనై 2' చిత్రాల్లో హన్సిక నటించారు.

తేనాండాల్‌ స్టూడియో లిమిటెడ్‌ సంస్థ రూ.300 కోట్లతో 'సంఘమిత్ర'ను ప్లాన్ చేస్తోంది. సుందర్‌.సి దర్శకత్వంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందనుంది.

English summary
Actress Hansika Motwani, who has been approached to play the leading role in upcoming Tamil historic drama "Sanghamitra" is yet to be finalised, according to source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu