»   »  ముదురు వెంకీతో పాలబుగ్గల హన్సిక???

ముదురు వెంకీతో పాలబుగ్గల హన్సిక???

Posted By:
Subscribe to Filmibeat Telugu
హన్సికా మొత్వానీ తెలుగులో నటించింది ఒకే సినిమా కానీ హాట్ గాళ్ గా నిలిచింది. ఇపుడు ఆమె జూనియర్ ఎన్టీఆర్ సరసన కంత్రీ సినిమా చేస్తోంది. మధ్యలో బాలీవుడ్ కు వెళ్లకపోయివుంటే హన్సికా ఇలియానాకు గట్టిపోటీ ఇచ్చేదేమో. అది సరే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించినున్న చింతకాయల రవి సినిమాలో హన్సికా హీరోయిన్ గా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే అనుష్క ఒక హీరోయిన్ గా ఎంపికయింది. రెండో హీరోయిన్ గా ప్రియమణిని కూడా పరిశీలిస్తున్న ఆ సినిమా దర్శక, నిర్మాతలు హన్సికాను ఎంపిక చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఒకవేళ హన్సికా ఎంపికయితే సీనియర్ హీరో సరసన తొలి అవకాశాన్ని కొట్టినట్టవుతుంది. వెంకటేష్ సరసన పాలబుగ్గల హన్సిక ఎలా ఉంటుందోననే ఉత్సుకత కూడా నెలకొన్నది. ఇంతకు ముందు వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ తో నటించినపుడు కూడా ఇలాంటి ఉత్కంఠ నడిచింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X