»   » పాపం హన్సిక ...పీక్కుపోయింది(ఫొటో)

పాపం హన్సిక ...పీక్కుపోయింది(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాత్రింబవళ్లు ఖాళీ లేకుండా కష్టపడితే ఎలా ఉంటుంది...ముఖం పీక్కుపోతుంది..గ్లామర్ దెబ్బతింటుంది. హన్సిక ఇప్పుడు అదే సమస్యను ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్తోంది. రాత్రిళ్లు కూడా షిప్ట్ లు వారీ డ్యూటీ చేస్తున్నానని, తన ముఖం ఎలా అయిపోయిందో చూడమంటూ ఈ క్రింద ఫొటోని ట్వీట్ చేసింది.

హన్సిక ట్వీట్ లో ... ''రోజుకు రెండు షిఫ్ట్‌ల్లో పని చేస్తున్నాను. నిద్రలేమితో నా ముఖం ఎలా పీక్కుపోయిందో చూడండి అంటూ'' ట్విట్టర్‌లో ఫొటోలు కూడా పెట్టింది. ఇలా చేస్తే ఆరోగ్యం చెడిపోదా అంటే.. ''అవకాశాల కోసం చాలా కాలం ఎదురు చూశాను. అప్పుడు రోజులో 24 గంటలు ఎలా పూర్తవుతాయా అని అనుకున్నాను. ఇప్పుడు వరుస అవకాశాలొస్తున్నాయి.. అందుకే సమయం చూడకుండా కష్టపడుతున్నాను. అయినా ఇది నేను కోరుకున్నదే కదా'' అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.

Hansika photo with Sleep deprived face

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది పెద్దలు చెప్పిన నానుడి. దీన్ని మన సినిమా వాళ్లు పాటించినంత బాగా ఇంకెవరూ పాటించరేమో అనిపిస్తుంటుంది. వరుస సినిమా అవకాశాలొస్తున్నప్పుడు రోజుకి 24 గంటలు కూడా సరిపోవనుకుంటారు. ఇప్పుడు హన్సిక పరిస్థితి కూడా ఇంతే. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రోజుకు 19 గంటలు కష్టపడుతోంది.

ప్రస్తుతం హన్సిక చేతుల్లో తెలుగు, తమిళం కలిపి మొత్తం ఆరు సినిమాలున్నాయి. ఇవన్నీ ఒకేసారి చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. రోజుకి రెండు షిఫ్ట్‌లపాటు 19 గంటలు సినిమా చిత్రీకరణలకే కేటాయిస్తోంది. చాలా అలసటకు గురవుతోందట. ఈ విషయాన్నే ఆమె చెప్పింది.

పెళ్లి గురించి మాట్లాడుతూ ''నా చేతినిండా సినిమాలున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నా. ఇక పెళ్లికొచ్చిన తొందరేముంది చెప్పండి? ఇంకా నా వయసు ఇరవై రెండే కదా?'' అని చెప్పుకొచ్చింది. హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.

'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.

English summary
Hansika tweeted:" Sleep deprived face working two shifts for few days bt no complainswork is worshipthe nyte just gets younger"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu