»   » రవితేజతో రొమాన్స్ చేయబోతున్న హన్సిక

రవితేజతో రొమాన్స్ చేయబోతున్న హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: హీరోయిన్ హన్సిక త్వరలో మాస్ మహరాజా రవితేజతో కలిసి నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా హన్సికనే ఖరారు చేసింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది. తొలిసారిగా మాస్ మహరాజ రవితేజతో కలిసి నటిస్తుండటం పట్ల చాలా ఆనందంగా ఉంది హన్సిక.

'అవును, రవితేజతో సినిమా చేయబోతున్నాను. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. ఇప్పటి వరకు బబ్లీ క్యారెక్టర్స్ మాత్రమే చేసారు. కానీ ఈ చిత్రంలో నేను చేయబోయే పాత్ర పూర్తి విభిన్నంగా నటనకు ప్రాధాన్యం ఉండేలా ఉంటుంది. నా కెరీర్లో మంచి పాత్రగా నిలుస్తుంది' అని హన్సిక తెలిపింది.

ఈ చిత్రం ద్వారా రచయిత కెఎస్ రవీందర్(బాబీ) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవీందర్ గతంలో బలుపు, మిస్టర్ పర్‌ఫెక్ట్, బాడీగార్డ్, డాన్ శీను చిత్రాలకు రచయితగా పని చేసారు. దర్శకుడిగా తన తొలి సినిమాను యాక్షన్ ఎంటర్టెనర్‌గా ప్లాన్ చేసుకున్నాడు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం హన్సిక మూడు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరెక్కుతున్న మంచు మల్టీ స్టారర్ సినిమాతో పాటు, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నాగచైతన్య సరసన ఓ సినిమాలో, కరుణాకరన్ దర్శకత్వంలో నితిన్ సరసన మరో సినిమాలో నటిస్తోంది.

English summary

 For the first time, Hansika Motwani bagged the chance of romancing Raviteja in a new movie to be directed by KS Ravindra aka Bobby.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu