»   »  శింబుపై కుట్ర: మాజీ ప్రియుడిపై జాలి చూపిన హన్సిక

శింబుపై కుట్ర: మాజీ ప్రియుడిపై జాలి చూపిన హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సిక ఆ మధ్య తమిళ హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించిన సంగతి తెలిసిందే. వీరిమధ్య చాలా ఘాటైన ప్రమాయణం సాగింది. అయితే ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో విబేధాలు రావడంతో బ్రేకప్ అయింది. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ‘వాలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

ఫైనాన్షియల్ సమస్యల కారణంగా ఆగి పోయింది. రెండేళ్లుగా ఈ చిత్రం అలానే ఉండి పోయింది. సినిమాకు సంబంధించిన ఓ సాంగు కూడా బ్యాలెన్స్ ఉంది. తాజాగా సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మిగిలి ఉన్న పాటను పూర్తి చేయడానికి హన్సికను సంప్రదించారు. తన మాజీ లవర్ శింబుతో సాంగు షూటింగులో పాల్గొనడానికి హన్సిక నాలుగు రోజుల డేట్స్ కేటాయించింది.

Hansika supports Simbu

ఆ సంగతి పక్కన పెడితే... శింబుపై కుట్ర జరుగుతోందని, తన చిత్రాన్ని విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారని నటుడు, నిర్మాత అయినత టి.రాజేంద్రన్ ఆందోళన వ్యక్తం చేసారు. శింబు సినిమాకు ఇలాంటి కష్టాలు రావడంపై హన్సిక జాలి పడింది. వెంటనే అతను వీటి నుండి బయట పడాలని కోరుకుంది. మాజీ ప్రియుడిపై హన్సిక ఇంత జాలి చూపడం హాట్ టాపిక్ అయింది.

‘వాలు' చిత్రాన్ని జులై 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాలు చిత్రానికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు, హన్సిక, సంతానం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Actress Hansika supports Simbu about Vaalu Movie issue.
Please Wait while comments are loading...