twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్తడే బోయ్ 'అమితాబ్' అరుదైన ఫోటోలు

    By Srikanya
    |

    ముంబై: సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఎన్నో తిరస్కారాలు... విమర్శలు... హేళనలు..! వాటన్నింటినీ భరిస్తూ తనను తాను శిల్పంగా మలచుకొన్న శిల్పి అమితాబ్‌ . ఈ రోజు(గురువారం) నాటికి అమితాబ్‌ బచ్చన్‌కి 70యేళ్లు నిండుతాయి. పతనాన్ని కాలి కింద అణగదొక్కేసి... శిఖరాల దిశగా ప్రయాణం సాగించిన ఆయన జీవితంలోని కొన్ని మలుపులు ఇవి...

    బర్తడే బోయ్ 'అమితాబ్' అరుదైన ఫోటోలు

    అక్టోబర్ 11,1942 ఆలిండియా మెగాస్టార్ అమితాబ్ జననం. తమ గారాల బిడ్డకి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో తండ్రి హరివంశరాయ్‌, తల్లి తేజీ 'ఇంక్విలాబ్‌' అనే పేరుని నిర్ణయించారు. అయితే వారి కుటుంబ మిత్రుడు, హిందీ కవి సుమిత్రానంద్‌ పంత్‌కి ఆ పేరు నచ్చలేదు. అనంతమైన ప్రకాశం అనే అర్థంలో అమితాబ్‌ అని నామకరణం చేశారు.

    బర్తడే బోయ్ 'అమితాబ్' అరుదైన ఫోటోలు

    నిజానికి అమితాబ్ ఇంటి పేరు బచ్చన్‌ కాదు. అది హరివంశరాయ్‌ కలం పేరు. వాళ్ల ఇంటి పేరు శ్రీవాస్తవ. బచ్చన్ కలం పేరుతో అమితాబ్ తండ్రి చాలా రచనలు చేసారు. తర్వాత అదే ఆ కుటుంబానికి ఇంటిపేరుగా మారిపోయింది. ఆ పేరు ప్రపచం మొత్తం నిరతంరం తలుచుకునే స్ధాయికి వస్తుందని హరివంశరాయ్ ఆ రోజున ఊహించి ఉండరు. కలం పేరు ఓ కుటుంబపేరులా స్ధిరపడిపోయింది.

    బర్తడే బోయ్ 'అమితాబ్' అరుదైన ఫోటోలు

    తమ్ముడు అజితాబ్‌ ప్రేరణతోనే రంగుల లోకం వైపు అడుగులు వేశారు. కలకత్తాలో చేస్తున్న ఉద్యోగం మానేసి బొంబాయికి చేరుకొన్నారు. అక్కడ అవకాశాలు లేక ఆకలితో సముద్ర తీరంలోని బల్లలపై పడుకొన్న రోజులూ ఆయన జీవితంలో ఉన్నాయి. చివరకు నర్గీస్‌ ఇచ్చిన సిఫార్సు లేఖను కె.ఎ.అబ్బాస్‌కి ఇస్తే 'సాత్‌ హిందుస్థానీ'లో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ అమితాబ్ కి బెస్ట్ న్యూ కమర్ గా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి అమితాబ్‌ సినీ ప్రయాణం మొదలైంది.

    బర్తడే బోయ్ 'అమితాబ్' అరుదైన ఫోటోలు

    అమితాబ్ బొంబాయి వచ్చేటప్పుడు మరచిపోకుండా తెచ్చుకున్నదేమిటో తెలుసా? డ్రైవింగ్‌ లైసెన్స్‌. సినిమా అవకాశం కోసం పోరాడతాను. ఒక వేళ దక్కకపోతే ఎవరి దగ్గరైనా కారు డ్రైవర్‌గా పని చేద్దామనుకొన్నాను అంటారు అమితాబ్‌. ఆయన మొదటి సూపర్‌ హిట్‌ సినిమా ప్రకాష్‌ మెహరా దర్శకత్వం వహించిన 'జంజీర్‌'. రచయిత సలీం జావిద్‌ రాసిన 'జంజీర్‌'లో మొదటిగా అమితాబ్‌ మెరిశారు. యాంగ్రీ యంగ్ మెన్ గా బాలీవుడ్ లో స్ధిరపడ్డారు. ఈ చిత్రానికి గానూ ఫిల్మ్ ఫేర్ నామినేషన్ పొందారు అమితాబ్.

    బర్తడే బోయ్ 'అమితాబ్' అరుదైన ఫోటోలు

    1973లో అమితాబ్ జీవితంలో మరో మలుపు. తన తోటి నటి జయ బాధురీని ఆయన వివాహం చేసుకున్నారు. ఆయనకు శ్వేత, అభిషేక్ బచ్చన్ ఇద్దరు పిల్లలు కలిగారు. అమితాబ్, జయ కలిసి జంజీర్(1973), అబిమాన్(1973), చుప్కే చుప్కే (1975), మిలీ(1975), షోలే(1975)లో నటించారు. వారిద్దరూ కలిసి నటించిన చివరి నటించిన చిత్రం కభి ఖుషీ కభి గమ్.

    కొత్త ఇన్నింగ్స్‌లో అమితాబ్‌ చేసిన 'బూమ్‌', 'అక్స్‌', 'జూమ్‌ బరాబర్‌ జూమ్‌' లాంటి చిత్రాలు ఆయన స్థాయికి తగ్గవి కాదని ప్రేక్షకులు తేల్చారు. ఆ తరవాత 'మొహబ్బతే', 'బ్లాక్‌', 'పా', 'చీనీకమ్‌', 'సర్కార్‌' లాంటి చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని రంజింపజేశారు. తనదైన నటనను చూపించారు. ''షోలే నా జీవితంలో గొప్ప చిత్రం అంటారు. నిజమే. అయితే నాకు నచ్చిన పాత్ర గబ్బర్‌సింగ్‌'' అని చెబుతారాయన. ఆ ఇష్టంతోనే షోలేని వర్మ 'ఆగ్‌' పేరుతో రీమేక్‌ చేస్తే గబ్బర్‌సింగ్‌ పాత్రలో నటించారు అమితాబ్‌. ఈ సినిమాయే కాదు అమితాబ్‌ నటన కూడా విమర్శల పాలైంది. అయినా ఆయన మొక్కువోని విశ్వాసంతో ఎప్పటికప్పుడు తన దగ్గరకు వచ్చే పాత్రలకు న్యాయం చేస్తూ నూతన తరం తారలకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ సందర్భాన అమితాబ్ కు ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

    English summary
    Shahenshah of Bollywood Amitabh Bachchan Turns 70, We(Oneindiatelugu) Wish Superstar, Megastar, Star of The Millennium, Big B, Cultural Icon A Very Happy 70th Birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X