»   » హాస్య బ్రహ్మీ బ్రహ్మానందంకి ‘బర్త్ డే ’ శుభాకాంక్షలు!

హాస్య బ్రహ్మీ బ్రహ్మానందంకి ‘బర్త్ డే ’ శుభాకాంక్షలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాకు హీరో, హీరోయిన్లు అవసరం లేకున్నా, ఒక్క నటుడు మాత్రం తప్పనిసరిగా కావాలి. చిత్రం దర్శకులు కూడా ఆయనకోసం ప్రత్యేకంగా ఓ పాత్రను సష్టించడం చూస్తుంటే ఇప్పుడ అసలు సినిమాకు హీరో ఆయనే అనేంతగా ఎదిగారు. మన నవ్వుల డాక్టర్, యాక్టర్ బ్రహ్మీ..బ్రహ్మానందం. ఇప్పటికీ 856 చిత్రాలలో కామెడీ పంచిన మన బ్రహ్మీ పుట్టినరోజు ఈ రోజు (01.02.10). ఈ సంక్రాంతికి విడుదల అయిన చిత్రాలు అదుర్స్, నమో వెంకటేశ..మొదలగు చిత్రాల్లో హీరోలతో పాటు తన పాత్ర ఉండటంతో అసలు హీరోలకంటే ముందు మన బ్రహ్మీ సంక్రాంతి హీరో అయ్యారు. బ్రహ్మానందం కన్నెగంటి ఫిబ్రవరి 1 1956 లో సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. ఆయన మాస్టర్ ఆఫ్ డిగ్రీ తెలుగు చేశారు. ఆయన మొదటి సినిమా జంద్యాల గారి అహానా పెళ్లంటా సినిమా తీయడానికి ముందు అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. ఇక అప్పటి నుండి అతని జాతక చక్రమే మారిపోయింది. 20సంవత్సరాల సినీ ప్రయాణం ఆయనకు 'గిన్నీస్ బుక్ ఆప్ రికార్డ్" సంపాదించి పెట్టింది. అంతే కాకుండా ఆచార్యనాగార్జున యూనివర్సిటీ బ్రహ్మానందంకి 'గౌరవప్రదమైన డాక్టరేట్" అవార్డు ప్రధానం చేసింది. భారత ప్రభుత్వంచే 'పద్మ శ్రీ" బిరుదును పొందిన గొప్పు హాస్య బ్రహ్మా బ్రహ్మానందంగారు.

ఆయన కోసం దర్శకుడు పాత్రను సష్టిస్తే, ఆపాత్రలో జీవించే బ్రహ్మీ, ప్రేక్షకులను తన హావభావాలతో ఆకట్టుకుంటూ, కడుపుబ్బా నవ్విస్తూ హాస్యాన్ని పండించే మన బ్రహ్మీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 25సంవత్సరాలు దాటడంతో సినీ ప్రముఖులు అందరూ ఆయనకు గ్రీటింగ్స్ తెలియజేశారు. మరెన్నో పాత్రలు చేసి మమ్మల్ని నవిస్తూ కలకాలం నవ్వూతూ బ్రహ్మానందం అండ్ ఫ్యామీలీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ 54వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. దట్స్ తెలుగు టీమ్ తరపున బ్రహ్మీ సార్! మెనీ మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ది డే!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu