»   » వైవిధ్య పాత్రల సృష్టికర్త కమల్ హాసన్ (రేర్ ఫోటోస్)

వైవిధ్య పాత్రల సృష్టికర్త కమల్ హాసన్ (రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెండితెరపై పాత్రల్ని అద్భుతంగా పండించే నటులుంటారు. అయితే పాత్రల్ని సృష్టించే నటులు మాత్రం అరుదుగానే ఉంటారు. ఇండియన్ సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన కమల్‌ హాసన్‌ రెండో కోవకు చెందుతారు. మరగుజ్జు, మానసిక వికలాంగుడు, సైకో ప్రేమికుడు అంటూ కొత్త వేషధారణలు పరిచయం చేశారు. భారతీయ వెండితెరపై తనదైన ముద్ర వేసిన కమల్‌ హాసన్‌ పుట్టినరోజు నేడు.

యూనివర్శల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ నేడు 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

కమల్ హాసన్

కమల్ హాసన్


కమల్‌ హాసన్‌ 1954 నవంబరు 7న మద్రాసు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని పరమకుడిలో శ్రీనివాసన్‌-రాజ్యలక్ష్మి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. కమల్‌ తండ్రి శ్రీనివాసన్‌ స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి. ఆ రోజుల్లో హిందూ, ముస్లిం కట్టుబాట్లు ఎక్కువగా ఉన్నా తన ప్రాణమిత్రుడి (ముస్లిం)కి విలువ ఇస్తూ, తమ స్నేహానికి గుర్తుగా తన ముగ్గురు కుమారుల పేర్లకు చివర్లో హాసన్‌ చేర్చి చారుహాసన్‌, చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌ అని పేర్లు పెట్టారు.

బాల నటుడిగా

బాల నటుడిగా


కమల్‌ హాసన్‌ తన ఆరేళ్ల వయసులో 'కళత్తూరు కన్నమ్మ'లో నటించాడు. 1960 ఆగస్టు 12న విడుదలైంది. జెమినీ గణేశన్‌-సావిత్రి ప్రధానపాత్రధారులు. కమల్‌ చిన్నతనంలోనే వారి కుటుంబం చెన్నైకు వలసరాగా ఆయన విద్యాభ్యాసం నగరంలోని టీ నగర్‌, ట్రిప్లికేన్‌లలో సాగింది.

జాతీయ అవార్డులు

జాతీయ అవార్డులు


కమల్ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును మూడుమార్లు దక్కించుకున్నారు. 1983లో వచ్చిన మూండ్రాపిరై, 1988లో విడుదలైన నాయగన్‌, 1997లో వచ్చిన ఇందియన్‌ చిత్రాలకు ఈ పురస్కారాలు అందుకున్నారు.

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు


హిందీలో వచ్చిన సాగర్‌, విరాసత్‌, తెలుగులో సాగర సంగమం, తమిళంలో 16 వయిదినిలే, సిగప్పు రోజాక్కల్‌ తదితర చిత్రాలకు మొత్తం 19 ఫిలింఫేర్‌ అవార్డులు దక్కించుకున్నారు.

నంది అవార్డులు

నంది అవార్డులు


సాగర సంగమం, స్వాతిముత్యం, ఇంద్రుడు చంద్రుడు చిత్రాలకుగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఎనిమిది సార్లు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.

పద్మ అవార్డులు

పద్మ అవార్డులు


1960లో కళత్తూరు కన్నమ్మ, 1976లో అపూర్వ రాగంగల్‌, 1993లో దేవర్‌మగన్‌, 1994లో మహానది, 1995 నమ్మవర్‌ తదితర కమల్‌ హాసన్‌ చిత్రాలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి, చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం తరఫున 'డాక్టరేట్‌' అందుకున్నారు.

పరకాయ ప్రవేశం

పరకాయ ప్రవేశం


పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు అనే మాట కొందరు నటుల విషయంలో అడపాదడపా వింటూ ఉంటాం. కమల్‌ హాసన్‌ విషయంలో మాత్రం ప్రతి చిత్రానికీ వింటాం. ఎందుకంటే పాత్ర కోసమే పుట్టారు అనిపించేలా జీవం పోస్తారు. 'నాయకుడు', 'సాగరసంగమం', 'గుణ', 'మహానది', 'భారతీయుడు', 'దశావతారం'... ఇలా ఏ చిత్రంలోని పాత్రను తీసుకున్నా - పరకాయ ప్రవేశం అనే మాటకు నిర్వచనంలా ఉంటుంది కమల్‌ నటన.

విశ్వరూపం 2

విశ్వరూపం 2


త్వరలో కమల్ హాసన్ ‘విశ్వరూపం 2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కమల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. తొలి భాగం విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

English summary

 Today (Nov 7) is Universal Star Kamal Haasan’s 59th birthday. The actor has been in movies for the last five decades, and he continues to be the towering phenomenon that movie business has finally come to terms with. He has been acknowledged as one of the finest actors on Indian screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu