»   » మోహన్ బాబు బర్త్‌డే: డార్లింగ్ అని ప్రభాస్, రాజమౌళి వెరైటీగా!

మోహన్ బాబు బర్త్‌డే: డార్లింగ్ అని ప్రభాస్, రాజమౌళి వెరైటీగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటన ఆయన ఇంటిపేరు ... క్రమశిక్షణ ఆయన అసలు పేరు. అభినయం ... అంకితభావం కలిసి ఏర్పడిన ఆరడుగుల అందమైన విగ్రహమే మోహన్ బాబు. అతను జనానికి ఒక 'పెదరాయుడు'. అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టిన 'అసెంబ్లీ రౌడీ'. భార్యలకు గిలిగింతలు పెట్టిన 'అల్లరి మొగుడు'. మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ విలక్షణ నటుడు.

నేడు మోహన్ బాబు పుట్టినరోజు. 1952, మార్చి19న చిత్తూరు జిల్లా మొదుగులపాలెంలో జన్మించాడు. అసలు పేరు 'మంచు భక్తవత్సలం నాయుడు'. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మోహన్ బాబుకి క్రమశిక్షణ ... అంకితభావం అనేవి తండ్రి నుంచే అలవడ్డాయి . ఆ లక్షణాలే ఆయన్ని లక్ష్యం దిశగా కదిలేలా చేశాయి ... లక్షలాది హృదయాలకి చేరువచేశాయి.

మోహన్ బాబు బాల్యం అంతా తిరుపతిలో గడిచింది. స్కూల్ చదువు తిరుపతిలోని ఏర్పేడు గ్రామంలో సాగింది. ఉన్నత చదువుల కోసం చెన్నయ్ వెళ్ళాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ఫిజికల్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేశాడు. అయితే మోహన్ బాబుకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. సినీ ఇండస్ట్రీలోకి రావడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు.

సినిమా ఇండస్ట్రీలోకి ఎలాగైనా ఎంటర్ కావాలనే ఉద్దేశంతో 50 రూపాయల జీతానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. ఏ మాత్రం చాలని ఆ జీతంతో ఇష్టంగా ఇబ్బందుల్ని అనుభవిస్తోన్న ఆయన్ని, అదృష్టమనేది దాసరి నారాయణరావు రూపంలో పలకరించింది.'స్వర్గం - నరకం' సినిమాతో ఆయనకో కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

విలన్ గా - కమెడియన్ గా - కామెడీ విలన్ గా - కేరక్టర్ యాక్టర్ గా - హీరోగా ప్రేక్షకుల హృదయాలను తన విలక్షణమైన మేనరిజంతో చకచకా దోచేస్తూ ఆయన ముందుకు సాగిపోయారు. హాస్య శృంగారాలను ... వీర రౌద్రాలను అవలీలగా పోషిస్తూ నవరసాల నమూనాగా నీరాజనాలు అందుకున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరున సొంత బ్యానర్ ను ఏర్పాటుచేసి, తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందారు.

మోహన్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు.

డార్లింగ్ అంటూ ప్రభాస్

డార్లింగ్ అంటూ ప్రభాస్

మోహన్ బాబుకు, ప్రభాస్‍‌కు మధ్య ఎంత మంచి రిలేషన్ ఉందో చెప్పడానికి ఈ ఫోటోయే నిదర్శనం. మోహన్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని డార్లింగ్ అని సంబోధిస్తూ ఈ ఫోటో పోస్టు చేసాడు ప్రభాస్.

రాజమౌళి ఇలా...

రాజమౌళి ఇలా...

యమదొంగ సినిమా సందర్భంలోని వర్కింగ్ స్టిల్ ను పోస్టు చేసిన రాజమౌళి, మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

తిరుపతిలో మోహన్ బాబు కుటుంబం

తిరుపతిలో మోహన్ బాబు కుటుంబం

పుట్టినరోజును పురస్కరించుకుని మోహన్ బాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

మోహన్ బాబు నెక్ట్స్ మూవీ

మోహన్ బాబు నెక్ట్స్ మూవీ

మెహన్ బాబు నటించిన ‘రౌడీ' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఆయన తనయుడు మంచు విష్ణు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.

English summary
Dialogue King Mohan Babu is celebrating his 62rd birthday today. He developed his own unique style of dialog diction with a career spanning close to four decades top the list of current generation star by holding over 500 movies to his credit with a wide spectrum of roles that include Hero, Villain, Comedian and character artist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu