»   » దటీజ్ పవన్ కళ్యాణ్-1 (రేర్ ఫోటోలతో)

దటీజ్ పవన్ కళ్యాణ్-1 (రేర్ ఫోటోలతో)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అప్పటికే తెలుగు సిని ఇండస్ట్రీని ఏలుతున్న మెగాస్టార్ కి తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేకతని మరియు ట్రెండ్ ని క్రియేట్ చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిన పవన్ కళ్యాణ్ హిట్,ప్లాప్ లతో సంభంధం లేని స్టార్ హీరోగా ఎదిగారు.

  'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'సుస్వాగతం', 'బద్రి' మరియు 'ఖుషి' చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాదించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ కి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు ఫ్యాన్స్ కు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.

  వరస పరాజయాల్లో ఉన్నా కొద్దిగా కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని కోల్పోని.. పవన్ 2012లో 'గబ్బర్ సింగ్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రంతో తనలోని ఎనర్జీ లెవల్స్, కామెడీ టైమింగ్ మరియు తన స్టైల్ ని మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించారు. ఆ తర్వాత వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు' ఓకే అనిపించుకున్నా ..ఇప్పుడు అత్తారింటికి దారేది చిత్రంతో ఓ రేంజి లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ...విడుదలకు కోసం అంతా ఎదురుచూసేలా చేస్తూ...దటీజ్ పవన్ అనిపించుకుంటున్నాడు.


  ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ... మిగతా విశేషాలు..స్లైడ్ షోలో...

  పవన్ మానియా..

  పవన్ మానియా..

  స్టార్ అయిన ప్రతి ఒక్కరూ ఎదుటివారిని ప్రభావితం చేయలేరు. అది అతి కొద్దిమందికే సాధ్యం. ఆ కొద్దిమందిలో కచ్చితంగా పవన్‌కల్యాణ్ ఒకరు. ప్రస్తుత యువతరానికి పవనిజాన్ని అనుసరించడం పరిపాటైపోయింది. దశాబ్దంన్నర క్రితం విడుదలైన ‘తొలిప్రేమ' నుంచే యువతలో ఈ పవన్ మానియా మొదలైంది.

  ‘పవర్‌స్టార్'

  ‘పవర్‌స్టార్'

  పవన్ క్రేజ్ జయాపజయాలకు అతీతం. తన అన్న చిరంజీవి వదిలి వెళ్లిన అగ్ర స్థానానికి అతి చేరువలో ఉన్న హీరో ఆయన. అందుకు ఆయన సినిమాల ఓపెనింగ్సే నిదర్శనం. అంతేకాదు.. మెగా హీరోలకు సంబంధించిన ఏ వేడుక జరిగినా... ఆ వేడుకలో పవన్ ఉన్నా, లేకున్నా.. అభిమానుల నుంచి ముక్తకంఠంతో వినిపించే పదం ఒక్కటే ‘పవర్‌స్టార్'. యూత్ ని ఆ స్థాయిలో మెస్మరైజ్ చేశారాయన.

  త్రివిక్రమ్

  త్రివిక్రమ్

  త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' సినిమా కోసం ప్రస్తుతం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే... మరోమారు ‘గబ్బర్‌సింగ్'లా పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం దర్శకుడు సంపత్‌నంది అద్భుతమైన కథ తయారు చేశారని సమాచారం. ఈ రెండు సినిమాలతో అభిమానులను ఓ రేంజ్‌లో ‘ఖుషీ' చేయనున్నారు పవర్‌స్టార్. నేడు ఆయన పుట్టిన రోజు. నేడంతా ఫ్యాన్స్‌కి పండగే పండగ.

  చిరుకి కాపీలా కాదు...

  చిరుకి కాపీలా కాదు...

  చిరంజీవి తమ్ముడంటే - చిరులా స్టెప్పులు వేయాలి, చిరులా ఫైటింగులు చేయాలి, డైలాగ్‌ చెబితే, నవ్వితే, నటిస్తే, నడిస్తే అన్నీ చిరంజీవిలానే ఉండాలి. ఇవేం పవన్‌లో లేవు. బహుశా... ఉన్నాయేమో, కానీ వాటిని లోలోపల దాచిపెట్టేశారు. తనలో ఉన్నదేంటో అదే బయట పెట్టారు. అన్నయ్యలా నటించడానికి, అన్నయ్య స్ఫూర్తితో నటించడానికి చాలా తేడా ఉంది. ఆ తేడా గుర్తించారు పవన్‌. చిరుకి కాపీలా కాదు, అసలు సిసలు పవన్‌లా తనని తాను ఆవిష్కరించుకొంటూ ప్రయాణం సాగించారు.

  తన ముద్రే...

  తన ముద్రే...

  నటన ఒక్కటే కాదు, సినిమాకి సంబంధించిన అన్ని ముఖ్యమైన విభాగాలపైనా పవన్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. గానం, నృత్యం, పోరాటాలు, రచన, దర్శకత్వం ఇలా ఏదైనా చేయగల సమర్థుడు.. పవన్‌ కల్యాణ్‌. ఆయన్ని మిగతా హీరో తో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టాయి.

  మననుంచే హీరో..

  మననుంచే హీరో..

  చిరు తమ్ముడిగా పవన్‌కి ఎంట్రీ సులభంగానే దొరికేసింది. అయితే క్రమంగా తనకుతాను ఎదగడం అలవాటు చేసుకొన్నాడు పవన్‌. తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఓ మాదిరిగా ఆడింది. 'గోకులంలో సీత'లో సెంటిమెంట్‌ పాళ్లు కాస్త ఎక్కువయ్యాయి. అయితే 'సుస్వాగతం' మాత్రం పవన్‌ని యువతరానికి చేరువ చేసింది. క్లైమాక్స్ సీన్స్ లలో పవన్‌ పలికిన సంభాషణలు 'మన నుంచి ఓ హీరో వచ్చాడు...' అనే సంకేతాన్ని యువ ప్రేక్షకుల్లో కలిగించాయి.

  క్లాస్..మాస్

  క్లాస్..మాస్

  ఇక 'తొలిప్రేమ'తో పవన్‌ మరింత బలమైన ముద్ర వేయగలిగారు. బాలు పాత్రలో ప్రతి ప్రేమికుడూ తనని తాను చూసుకొన్నాడు. 'తమ్ముడు' సినిమాతో పవన్‌ ఏమేం చేయగలడో అందరికీ అర్థమైంది. 'బద్రి'తో మాస్‌ని, క్లాస్‌నీ మురిపించేశాడు. 'ఖుషి' అయితే అభిమానులకు పండగే. 'జల్సా', 'గబ్బర్‌ సింగ్‌' విజయాలు పవన్‌ శక్తిసామర్థ్యాలకు అద్దం పట్టాయి.

  మేనరిజం...

  మేనరిజం...

  పవన్‌ అంటే... స్త్టెల్‌ అని చెప్తుంటారు ఫ్యాన్స్. సంభాషణలు పలికే విధానంలోనూ, పాత్రని సొంతం చేసుకొనే విషయంలోనూ తన సొంత ముద్ర చూపించాడు పవన్‌ కల్యాణ్‌. 'తమ్ముడు' నుంచి పవన్‌ మేనరిజంలో మార్పులు కనిపించాయి. 'బద్రి'లో హీరోయిజాన్ని సరికొత్త రీతిలో చూసే అవకాశం వచ్చింది. ఫైట్‌ అంటే బీభత్సంగా ఉండాల్సిన అవసరం లేదని, అందులోనూ స్త్టెల్‌ చూపించొచ్చని నిరూపించాడు. మెడ మీద చేయి వేసుకొని రుద్దుకోవడం పవన్‌ సృష్టించిన అరుదైన మేనరిజం. అది అభిమానులకు విపరీతంగా నచ్చింది.

  కాస్ట్యూమ్స్ లోనూ...

  కాస్ట్యూమ్స్ లోనూ...

  కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా పవన్‌ చాలా జాగ్రత్తలు తీసుకొనేవారు. 'ఖుషి'లో పవన్‌ వస్త్రధారణ యువతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. 'గుడుంబా శంకర్‌'లో ఫ్యాంటుమీద ఫ్యాంట్‌ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. 'బద్రి' వచ్చి పన్నెండేళ్లయినా పవన్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ శైలే.

  వ్యక్తిత్వమే ...

  వ్యక్తిత్వమే ...

  పవన్‌ సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డుల కంటే, ఆయన వ్యక్తిత్వమే ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించిపెట్టింది. సెట్లో ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారని ఆయనతో పనిచేసేవాళ్లంతా చెప్తుంటారు. అడిగినవారికీ, అడగని వారికీ 'నేనున్నా' అంటూ భరోసా ఇచ్చే మనసు పవన్‌దే - ఇదీ పవన్‌ని దగ్గరుండి చూసినవాళ్ల మాట.

  సాదాసీదాగా..

  సాదాసీదాగా..


  సినీ తారలు నిత్యం ఏసీ గదుల్లో, సకల సౌఖ్యాలతో జీవిస్తుంటారు అనుకొంటుంటారు. కానీ పవన్‌ మాత్రం అందుకు విరుద్ధం. హైదరాబాద్‌ నగర శివార్లలో ఆయనకో ఫామ్‌హౌస్‌ ఉంది. అక్కడ వ్యవసాయం చేస్తుంటారు. పూల మొక్కల్ని పెంచడం పవన్‌కి ఇష్టమైన పని. నులకమంచం, మట్టి కుండలూ, కొడవళ్లూ, గడ్డపారలూ, ఎరువులూ ఇవీ ఆ ఇంట్లో ఉండే వస్తువులు.

  పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్

  ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది' సినిమా త్వరలోనే ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

  English summary
  Pawan Kalyan, one of the most charismatic and iconic stars of Telugu cinema and turns 42. Today is his birthday. His Attaritiniki Daaredi co-star Samantha has this to say: "Happy happy birthday Pawan sir... God bless u.. Will always be in admiration of the person u are..". We at Thatstelugu.com wish the star a very happy birthday and success.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more