»   » వెండితెరపై బాహుబలి లాంటి మ్యాజిక్‌లు ఎన్నో చేయాలి.. మోహన్‌లాల్, చంద్రబాబు, రమ్యకృష్ణ

వెండితెరపై బాహుబలి లాంటి మ్యాజిక్‌లు ఎన్నో చేయాలి.. మోహన్‌లాల్, చంద్రబాబు, రమ్యకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాహుబలి చిత్రం ద్వారా రాజమౌళి తొలిసారి 1000 క్లబ్‌లోకి చేరాడు. సంచలన విజయంతో తిరుగులేని దర్శకుడిగా మారాడు. అలాంటి దర్శక ధీరుడు రాజమౌళి తన పుట్టినరోజు (అక్టోబర్ 10)ను జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మోహన్ లాల్

హ్యాపీ బర్త్‌డే రాజమౌళి. మరెన్నో విజయవంతమైన జన్నదినాలు జరుపుకోవాలి అని దక్షిణాది విలక్షణ నటుడు మోహన్ లాల్ ట్వీట్ చేశారు.

Birthday Special : Intresting Facts About SS Rajamouli

కాజల్ అగర్వాల్

మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సుఖ:సంతోషాలతో వర్ధిల్లాలి అని సినీ తార కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.

మీరు గొప్ప విజన్ ఉన్న

భారతీయ సినిమా పరిశ్రమలో ఉత్తమ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు గొప్ప విజన్ ఉన్న దర్శకుడివి. సినీ తెర మీద కథ చెప్పడంలో మీకు మీరే సాటి అని కరణ్ జోహర్ ట్వీట్ చేశారు.

గొప్ప మేధాశక్తికి

మంచి విజన్ ఉన్న వ్యక్తికి, గొప్ప నాయకుడికి, గొప్ప మేధాశక్తికి మీరు చక్కటి ఉదాహరణ. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, మరెన్నో జన్నదినోత్సవాలను జరుపుకోవాలని సీనియర్ నటి రమ్యకృష్ణ ట్వీట్ చేశారు.

మీరు మరెన్నో అద్భుతాలు

తెలుగు సినీ దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరెన్నో అద్భుతమైన చిత్రాలను తీయాలి. మీ దర్శక పటిమతో మ్యాజిక్ చేయాలని కోరుకుంటున్నాను అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

గొప్ప దర్శకుడైన మీరు

గొప్ప దర్శకుడైన మీరు ఎన్నో జన్నదినాలు జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తున్నాను అని దర్శకుడు అట్లీ ట్వీట్ చేశారు.

సినిమా ప్రతిష్ఠను మరింత

భారతీయ సినిమా ప్రతిష్ఠను మరింత ముందుకు తీసుకెళ్లాలి. మీరు మరెన్నో జన్మదినోత్సవాలను జరుపుకోవాలి దర్శకుడు హారీష్ శంకర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

English summary
He became a global phenomenon after creating the world of Baahubali, which is hailed as the best period film since Mughal-E-Azam. As the celebrated director turns a year older today, several celebrities wished the Baahubali filmmaker on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu