Happy birthday Tom Cruise: ప్రాణాలను సైతం లెక్క చేయని రియల్ హీరో.. బెస్ట్ బాక్సాఫీస్ హిట్స్!
టామ్ క్రూజ్ అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు. ప్రపంచంలోనే అత్యంత స్టార్ డమ్ కలిగిన హీరో అని చెప్పవచ్చు. నాలుగు దశాబ్దాలుగా సినీ జీవితంలో టామ్ క్రూజ్ చేసిన సినిమాలు అతని ధైర్యానికి ప్రతిరూపాలుగా నిలిచాయి. ప్రాణాలను లెక్క చేయకుండా ఎన్నో రియల్ యాక్షన్ సీన్స్ లో నటించారు. నేడు ఆయన 59వ పుట్టినరోజు కావడంతో వరల్డ్ వైడ్ గా అభిమానులు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.

ఎన్నో రియల్ స్టంట్స్
టామ్ క్రూజ్ అనగానే అందరికి రియల్ యాక్షన్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ లో నటించడం అతనికి వెన్నతో పెట్టిన విద్యా ఆకాశంలో విమానం నుంచి దూకడం అలాగే కొండల మధ్య స్పీడ్ గా పారాగ్లైడింగ్ చేయడం వంటి ఎన్నో రియల్ స్టంట్స్ చేశాడు.

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్
"రిస్కీ బిజినెస్" "టాప్ గన్" " నీడ్ ఫర్ స్పీడ్" "జెర్రీ మాగైర్" వంటి ఎన్నో భారీ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక అతని ఆల్ టైమ్ హిట్స్ లలో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలు టాప్ లో ఉంటాయి. ఇప్పటికే 6 సిరీస్ లతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకోగా అందరూ 7వ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

టాప్ బాక్సాఫీస్ హిట్స్
ఇక అతని కెరీర్ లో అత్యదిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల లొస్తులోకి వెళితే.. మిషన్: ఇంపాజిబుల్ - ఫాల్అవుట్ (2018) టాప్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా 782.2 మిలియన్ డాలర్లను అందించింది. ఇక మిషన్: ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రోటోకాల్ (2011) - 694.7మిలీయన్ల డాలర్లను రాబట్టింది. ఇక మూడవ స్థానంలో మిషన్: ఇంపాజిబుల్ - రోగ్ నేషన్ (2015) కొనసాగుతొంది. ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 688.8మిలీయన్ల డాలర్లు వచ్చాయి.

నెక్స్ట్ అంతరిక్షంలో షూటింగ్
ఎలాంటి సినిమా చేసినా కూడా టామ్ ప్రాణాలకు తెగించి యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుంటాడు. ఇక నెక్స్ట్ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ను అంతరిక్షంలో కూడా కొనసాగించాలని అనుకుంటున్నాడు. నాసాతో కలిసి ఇప్పటికే ఒక అగ్రిమెంట్ సెట్ చేసుకున్నారు. మిషిన్ ఇంపాజిబుల్ 7 వచ్చే ఏడాది మే లో రానుంది. ఇక ఆ తరువాత రాబోయే సిరీస్ అంతరిక్షంలో షూట్ చేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











