"హ్యాపీడేస్ " హీరో తండ్రి అయ్యాడు
శేఖర్ కమ్ముల "హ్యాపీడేస్ " చిత్రంలో హీరోలులో ఒకడుగా చేసిన వంశీ రీసెంట్ గా ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. హ్యాపీడేస్ సమయంలోనే వివాహం చేసుకున్న వంశీ కి ఓ పాప జన్మించింది.తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నారు.ఇక వంశీ ప్రస్తుతం "పేరెంట్స్ "చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.
"పేరెంట్స్ " చిత్రం ద్వారా రవి దర్శకుడిగా పరిచయమవుతున్నారు రవి.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "ఆనంద్ ' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన రవి ఆ చిత్రం ద్వారా ఆనంద్ రవిగా పేరుపొందాడు.అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలొ వచ్చిన "హ్యాపీడేస్ ", "గోదావరి ","లీడర్ ",వంటి చిత్రాలలో కూడా దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పని చేశాడు.


Click it and Unblock the Notifications











