»   » అది బన్నీ కోసమే చేసాను...శ్రధ్దా దాస్

అది బన్నీ కోసమే చేసాను...శ్రధ్దా దాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజం చెప్పాలంటే బన్నీ కోసమే 'ఆర్య 2' సినిమా చేశా. ఆ పాత్రకస్సలు మాటలే ఉండవు...కానీ ఆ సినిమాతో నాకొచ్చిన గుర్తింపు తక్కువేం కాదు. అందులో నేను చాలా అందంగా కనిపించానని అందరూ అన్నారు అంటూ చెప్పుకొచ్చింది శ్రధ్దా దాస్. దిల్ రాజు నిర్మించిన మరో చరిత్రలో ఆమె ఓ కీలక పాత్ర చేసింది. ఆ చిత్రం ప్రమోషన్ నిమిత్తం ఆమెను కలిసిన మీడియాతో మాట్లాడింది. అలాగే మరో చరిత్రలో చాలా తృప్తినిచ్చిందని చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే..బాలచందర్‌ 'మరో చరిత్ర'లో మాధవి చేసిన పాత్ర నాకు లభించడం గొప్పగా అనిపించింది. కాకపోతే...కొన్ని తేడాలుంటాయి. మొదటిసారి నాలోని నటిని బయటకి తీసుకొచ్చింది అంది. ఇక గ్లామరు కొన్నిసార్లు శ్రుతి మించుతున్నట్టుంది అంటే...అసలు గ్లామర్‌ అంటే ఏమిటి? దానికేమైనా ప్రత్యేకమైన కొలతలు ఉన్నాయా? ఒక్కోచోట ఒక్కోలా చెబుతారు. బాలీవుడ్‌లో టూ పీస్‌లతో కనిపించినా మామూలుగానే ఉంటుంది. ఇక్కడ అలా దర్శనమిస్తే...ఎక్కువ చేస్తున్నట్టు ఉంటుంది. పాత్రని బట్టి..సన్నివేశాన్ని బట్టి అప్పుడప్పుడూ హద్దులు దాటినా తప్పులేదు అంది. అలాగే 'డార్లింగ్‌' సినిమాలోనూ నాది మంచి పాత్రే. గ్లామర్‌గా ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఆమె లాహోర్ అనే బాలీవుడ్ చిత్రంలో చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu