»   » టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి

టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బీరువా... సినిమా నార్మల్ గానే ఆడింది మరీ పెద్ద హిట్ అనలేం కానీ ప్రేక్షకులకు దగ్గరగానే విళ్ళింది. అయితే బీరువాలో మరింత సూపర్ హిట్ అయిన విషయం ఇంకొకటి ఉంది "సురభి" అప్పుడే అరంగేట్రం చేసినట్టు అనిపించే అమ్మాయి యాక్టింగ్ లో మాత్రం తన టాలెంట్ ఏమితో చూపించేసింది.. అయితే టాలీవుద్ ఎందుకో కాస్త చూపు పక్కకు తిప్పింది అంతే సిద్దంగా ఉన్న కోలీవుడ్ బీరువాలో ఉన్న పిల్లని ఎగరేసుకు పోయింది.

కుంగుఫూరాణి

కుంగుఫూరాణి

రఘువరన్ బీటెక్ లో సురభిని చూసాక నాలిక్కరుచుకున్న టాలీవుడ్ అబ్బబ్బ ప్లీజ్ వచ్చేయ్యమ్మా..అని బుజ్జగించుకుని మరీ కుంగుఫూరాణి ని జెంటిల్ మేన్ తో జతకట్టించింది.... ఇలా టాలీవుడ్ తనమీద సురభి అనే అందమైన సంతకాన్ని చేయించుకుంది....

తొమ్మిదో తరగతిలో ఉండగా

తొమ్మిదో తరగతిలో ఉండగా

మొదటిసారితొమ్మిదో తరగతిలో ఉండగా ఓ పేపర్‌ ప్రకటనకోసం ఫోజిచ్చిందట. ఆ తర్వాత గుర్గావ్ లో జరిగిన అందాల పోటీలో మిస్‌ ఫొటోజెనిక్‌గా.. రెండో రన్నరప్‌గానూ నిలిచినప్పుడే మోడలింగ్ వైపు వచ్చిన సురభి. డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగా మోడలింగ్‌ మొదలుపెట్టింది.

ఎయిర్‌టెల్‌ యాడ్‌

ఎయిర్‌టెల్‌ యాడ్‌

ఎయిర్‌టెల్‌ యాడ్‌తో పాటు మరికొన్ని ప్రకటనల్లోనూ పనిచేస్తూ. పనిలోపనిగా ఫైన్‌ ఆర్ట్స్‌ పెయింటింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి పారేసింది. మరోపక్క ఇమాజో యాక్టింగ్‌ స్కూల్లో మనోజ్‌ బాజ్‌పేయి దగ్గర పాఠాలు నేర్చుకున్నాక. ఓ పక్క మోడలింగ్‌ చేస్తూనే నటిగా నిరూపించుకోవడానికి ఆడిషన్స్‌కి వెళ్ళేస్దట. అలాగే బీరువా ఆడిషన్స్ కి రావట్మ్ సెలక్టైపోవటంతెలుగు ప్రేక్షకులకి చిక్కిపోవటం జరిగింది..

ప్లస్ పాయింట్‌

ప్లస్ పాయింట్‌

ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తావు. అదే నీలో ఉన్న గొప్ప లక్షణం అని చాలామంది చెబుతుంటారు. దీనినే నా ప్లస్ పాయింట్‌గా భావిస్తాను. ప్రతిభ, కష్టపడేతత్వాన్ని నమ్ముతాను. " బీరువా సినిమా కోసం తొలిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు చాలా నచ్చాయి.

తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని ఆదరిస్తుంటారు

తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని ఆదరిస్తుంటారు

భాషాభేదాలకు అతీతంగా తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని ఆదరిస్తుంటారు. అమ్మ చేతి వంట- హైదరాబాద్ వెజ్ బిర్యానీ: నేను శాఖాహారిని. అమ్మ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్ వెజ్ బిర్యానీ చాలా ఇష్టం. అని చెప్పే సురభి టాలీవుడ్ లో మరిన్ని అవాకాశాలను అందుకుంటుందనే ఆశిద్దాం...

English summary
HappyBirth Day Surabhi: Surbhi is an Indian actress who predominantly appears in Tamil and Telugu films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu