»   » వైభవంగా హర్భజన్-గీతా బస్రా వివాహం (ఫోటోస్)

వైభవంగా హర్భజన్-గీతా బస్రా వివాహం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి గీతా బస్రా వివాహం క్రికెటర్ హర్భజన్ సింగ్ తో గురువారం గ్రాండ్ గా జరిగింది. పంజాబ్ లోని జలంధర్ వీరి పెళ్లికి వేదికైంది. దాదాపు ఐదేళ్లుగా ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. ఎట్టకేలకు ఇద్దరూ పెళ్లితో దంపతులయ్యారు.
హర్భజన్-గీతా బస్రా వివాహం పూర్తిగా పంజాబీ సాంప్రదాయ బద్దంగా సాగింది. ఈ వేడుకకు క్లోజ్ ఫ్రెండ్స్, సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. బజ్జీకి సన్నిహితంగా ఉండే సచిన్ టెండూల్కర్ సతీమేతంగా ఈ వేడుకకు హజరయ్యాడు. పెళ్లి వేడుకలో సచిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు.

నవంబర్ 1, 2015వ తేదీన ఢిల్లీలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు క్రికెట్ రంగానికి చెందిన దేశవిదేశాల నుండి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ హాజరు కాబోతున్నారు. గ్రాండ్ రిసెప్షన్ వేడుకల్లో ఒకటిగా ఇది నిలవబోతోంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

వివాహానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

హర్భజన్-గీతా

హర్భజన్-గీతా


హర్భజన్-గీతా బస్రా వివాహం పంజాబ్ లోని జలంధర్ లో గ్రాండ్ గా సాగింది.

పెళ్లివేడుక

పెళ్లివేడుక


బజ్జీ, గీత వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది.

సాంప్రదాయ దుస్తుల్లో...

సాంప్రదాయ దుస్తుల్లో...


పంజాబీ సాంప్రదాయ దుస్తుల్లో, చేతిలో తల్వార్ తో హర్భజన్ సింగ్.

అందాల సుందరి

అందాల సుందరి


ప్రత్యేకంగా డిజైన్ చేసిన పెళ్లి డ్రెస్ లో గీతా బస్రా అందాల సుందరిలా వెలిగి పోయింది.

రెడీ చేస్తూ..

రెడీ చేస్తూ..


బజ్జీని పెళ్లికి రెడీ చేస్తున్న బంధువులు.

పెళ్లి వేదిక వద్దకు వస్తూ..

పెళ్లి వేదిక వద్దకు వస్తూ..


పెళ్లి వేదిక వద్దకు తరలి వస్తూ హర్భజన్ ఇలా...

సచిన్..

సచిన్..


హర్భజన్, గీతా బస్రా పెళ్లి వేడుకకు సతీసమేతంగా హాజరైన సచిన్.

English summary
India cricketer Harbhajan Singh and Bollywood actress Geeta Basra finally tied the knot on Wednesday in Jalandhar. The 35-year-old off-spinner and Basra completed the wedding after a long relation. The couple chose traditional attires for the ceremony.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu