Just In
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్: కరోనాపై భారత్‌దే పైచేయి, మోడీ సర్కారు సక్సెస్, లాక్డౌన్ ఎఫెక్ట్, వ్యాక్సిన్‌కే మొగ్గు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడ అమలను చూసి అప్‌సెట్: నాగార్జున
హైదరాబాద్ : దాదాపు ఇరవయ్యేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అమల వెండితెరపై కనిపించిన చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అమల భర్త నాగార్జున చూసారు. ఆయన ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ...నేను అలాంటి పాత్రలో అమలను చూడటం చాలా కష్టమైంది అన్నారు. ఆమెకు చాలా ప్రశంసలు లభించి ఉండవచ్చు. కానీ నా అందమైన భార్య అలా ఓ కాన్సర్ పేషెంట్ లా చూడటం నేను ఎంజాయ్ చేయలేను అన్నారు.
అలాగే అమల ఎప్పుడూ తన అందమైన నవ్వుతో ఇంట్లో కనపడుతూ ఉంటుంది. అలాంటిది ఇలా కాన్సర్ పేషెంట్ లా ఉండటంతో చాలా ఫీలయ్యాం. మా అబ్బాయి అఖిల్ కూడా చాలా అప్ సెట్ అయ్యాడు. కానీ ఆమె పాత్రతో మంచి మెసేజ్ ను సమాజంలోకి పంపారు. అది సంతోషంగా ఉంది అన్నారు. నూతన తారలతో అమీగోస్ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజిత్, సుధాకర్, కౌశిక్, జార, రస్మి, కావ్య, నవీన్, విజయ్, సంజయ్ తదితర నూతన తారలు పరిచయమయ్యారు.
ఈ చిత్రం గురించి అమల మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను 'విడో' (విధవరాలు)ని. ఉద్యోగం చేసుకుంటూ, ముగ్గురు పిల్లల్ని పెంచుతుంటాను. పైకి సున్నితంగా కనిపించినా లోపల మాత్రం చాల పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్న మహిళని. ఈ పాత్ర చాలామందిని ఇన్‌స్పయిర్ చేస్తుంది. ఈ చిత్రంలో ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించాను. అలాగే నాకు కొడుకు ఉన్నాడు కానీ కూతుళ్లు లేరు. మనకే కనుక కూతుళ్లు ఉండి ఉంటే.. వాళ్లతో మనం ఇలానే ఉండేవాళ్లమేమో అనే ఫీల్ ఈ షూటింగ్ చేసినప్పుడు కలిగింది అంటూ చెప్పుకొచ్చింది అమల.
ఇక ''మనది కాని జీవితంలోకి తొంగి చూసే అవకాశం నటులకు మాత్రమే ఉంటుందేమో. ఆ విషయంలో నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. ఇందులో నటిస్తున్నంతసేపూ ఓ కొత్త జీవితాన్ని ఆస్వాదించిన అనుభూతి కలిగింది. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిగిన ఓ వితంతువుగా కనిపిస్తాను. పిల్లల్లో మంచితనాన్ని బయటికి తీసుకొచ్చే గృహిణి పాత్ర పోషించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మా ఇంట్లో అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిలు ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నటించాక తెలిసింది. చూడ్డానికి సాధారణంగా ఉన్నా... మానసిక ధృడత్వం కలిగిన మహిళగా నటించాను. సమాజానికి స్ఫూర్తినిచ్చే ఓ మంచి పాత్రలో నటించానన్న తృప్తి నాకు కలిగింది'' అని చెప్పుకొచ్చింది.