»   » అమ్మ ముద్దాడింది, నాన్న కళ్లు చెమర్చాయి: ఎన్టీఆర్

అమ్మ ముద్దాడింది, నాన్న కళ్లు చెమర్చాయి: ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘టెంపర్' మూవీ ఇటీవల విడుదలై విజయ పథంలో దూసుకెలుతున్న నేపథ్యంలో జూ ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఉత్సాహంతో చాలా గ్యాప్ తర్వాత ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ చిత్ర కథారచయిత, ఎన్టీఆర్ ఫ్రెండ్ అయిన వక్కతం వంశీ స్వయంగా ఆయన్ను ఇంటర్వ్యూ చేసారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ముందుగా సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూసిన తర్వాత అమ్మ ఎంతో ఎమోషన్ అయిందని, కోర్టు సీన్ తర్వాత నన్ను ముద్దాడినట్లు తెలిపారు.


Harikrishna cries after watching Temper

‘సినిమా ఫస్టాఫ్ పూర్తయింది. అమ్మ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఫస్టాఫ్ మొత్తం సీరియస్ గానే చూసింది. నా క్యారెక్టర్ తీరు నెగెటివ్ గా ఉండటం ఆమెకు నచ్చలేదుకుంటా. అయితే నా క్యారెక్టర్లో మార్పు వచ్చిన తర్వాత ఆమె మొహంలో నవ్వు కనిపించింది. సెకండాప్ లో కోర్టు సీన్ పూర్తయిన తర్వాత నన్ను ముద్దాడింది' అని ఎన్టీఆర్ తెలిపారు.


సినిమా చూసిన తర్వాత తన తండ్రి హరికృష్ణ రియాక్షన్ గురించి వెల్లడిస్తూ....‘నాన్నకు సినిమా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేసారు. సినిమా పూర్తయిన తర్వాత ఆయన కళ్లు చెమర్చాయి. మా పెద్దన్నయ్య జానకి రామ్ ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి మా మధ్య లేనందుకు ఆయనలో బాధ కనిపించింది' అన్నారు.

English summary
NTR thanked his fans for making the Temper super hit.NTR said that his mother got emotion after watching the film and kissed him after the court scene.
Please Wait while comments are loading...