twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తండ్రి ప్రాణం తీసిన పొలం వద్దు.. 250 ఎకరాలు అమ్మేసిన ఎన్టీఆర్, హరికృష్ణకు ముందే తెలుసా!

    |

    Recommended Video

    Harikrishna's Interview About Their Family Incidents

    తన తండ్రి ఎన్టీఆర్ కు ఎన్నికల ప్రచారంలో రథ సారధిగా నందమూరి హరికృష్ణ పనిచేశారు. టిడిపి ఈ స్థాయిలో ఉండడానికి ఆయన కృషి కూడా కారణం. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా నందమూరి వంశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి చర్చ జరుగుతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు తండ్రి లక్ష్మయ్య చౌదరి కాలం నుంచే ఈ ప్రమాదాలు నందమూరి వంశాన్ని వేధిస్తున్నాయి.

    హరికృష్ణకు ముందే

    హరికృష్ణకు ముందే

    ఎన్టీఆర్ కుటుంబ నేపథ్యం, తన తండ్రి సమయంలో జరిగిన పరిస్థితుల గురించి హరికృష్ణకు పూర్తి అవగాహన ఉంది.తన తాత లక్ష్మయ్య చౌదరి కాలం నుంచే ఈ ప్రమాదాలు నందమూరి కుటుంబాన్ని వేధిస్తున్నాయనే విషయం హరికృష్ణకు తెలుసు. గతంలో ఓ ఇంటర్వ్యూ లో హరికృష్ణ ఈ విషయాన్ని తెలిపారు.

     సిటీలంటే చిరాకు

    సిటీలంటే చిరాకు

    ఆ ఇంటర్వ్యూ లో హరికృష్ణ మాట్లాడుతూ.. నాకు సిటీలంటే చిరాకు. నాన్న సినిమాలతో చెన్నై, హైదరాబాద్ తిరుగుతుండేవారు.నాబాల్యం మొత్తం నిమకూరులోనే గడిచింది. చుట్టం చూపుగా మాత్రమే నాన్న వద్దకు చెన్నై, హైదరాబాద్ వెళ్ళేవాడిని. నాకు సిటీలంటే చిరాకు. అందుకే ఎప్పుడూ నిమ్మకూరులోనే ఉండేవాడిని.

     తాతయ్యే అన్నీ

    తాతయ్యే అన్నీ


    నా ఇష్టాలకు అనుగుణంగానే తాతయ్య లక్షయ్య చౌదరి నన్ను నిమ్మకూరులోనే పెంచారు. తల్లి తండ్రి నాకు అన్నీ తాతయ్యే. నాన్న వద్దకు చెన్నై వెళ్లినా అక్కడ సిటీ వాతావరణం నాకు జైలుని తలపించేది. ఎక్కువ రోజులు ఉండేవాడిని కాదు. పల్లెటూరిలో పొలాలు, స్వచ్ఛమైన గాలి, నానమ్మ, తాతయ్య అనురాగం బాగా ఆస్వాదించేవాడిని.

     ఇష్టం లేకపోయినా

    ఇష్టం లేకపోయినా

    1976 లో నాన్నగారు హైదరాబాద్ లో రామకృష్ణ స్టూడియో కట్టడం ప్రారంభించారు. అందువలన బలవంతంగా ఇక్కడకు రావలసి వచ్చింది. మొదట రానని మొండికేశా. నువ్వు ఇక్కడ అన్నీ చూసుకుంటావనే స్టూడియో కడుతున్నా. నీకు తోడుగా తాతయ్య కూడా ఇక్కడికే వస్తారు అని నాన్నగారు చెప్పారు. ఆ మాటతో అంగీకరించా.

     తాతయ్య కూడా

    తాతయ్య కూడా

    హైదరాబాద్ కు వెళ్ళాక తాతయ్య ఒకసారి శంషాబాద్ సమీపంలో ఉన్న మా పొలాలు చూసి వస్తున్నారు. ఆ సమయంలో రాజేంద్ర నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతయ్య మరణించారు.

     250 ఎకరాలు

    250 ఎకరాలు

    నా తండ్రి ప్రాణం తీసిన పొలం నాకు వద్దు అంటూ నాన్నగారు 250 ఎకరాలు ఉన్నపళంగా అమ్మేశారు. ఇలా తన పాత జ్ఞాపకాలని హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. దీనిని బట్టి తాతల కాలం నుంచే నందమూరి వంశాన్ని ఈ ప్రమాదాలు వెంటాడుతున్నాయనే విషయం అర్థం అవుతోంది.

    వరుసగా

    వరుసగా

    నాలుగేళ్ళ క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మరణించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురై జూ. ఎన్టీఆర్ గాయపడ్డాడు. క్షేమంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. తాతయ్య లక్ష్మయ్య చౌదరి, కురుడు జానకిరామ్ తరహాలోనే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం.

    English summary
    Harikrishna Grandfather also died in road accident. Interesting facts about Harikrishna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X