»   » లంగాకు బదులు లుంగీ: హరిప్రియ గలాట (ఫోటో)

లంగాకు బదులు లుంగీ: హరిప్రియ గలాట (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ హరిప్రియ తన రాబోయే సినిమాలో ఓ సీన్లో ఆడాళ్లు ధరించే లంగాకు బదులు...మగాళ్లు ధరించే లుంగీతో దర్శనం ఇవ్వబోతోంది. ఆ సినిమా మరేదోకాదు రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాతగా, క్రియేటివ్ పిక్సల్ ప్రొడక్షన్స్ లో దర్శకుడు కృష్ణ తెరకెక్కిస్తున్న 'గలాట'.

దీని గురించి హరిప్రియ మాట్లాడుతూ....'తొలుత లుంగి ధరించడానికి నిరాకరించాను. కానీ లుంగీతో చేయాల్సిన సీన్ సినిమాకు ఎంత అవసరమో దర్శకుడు చెప్పాక ఒప్పుకున్నాను. సినిమాలో నా ఇంట్రడక్షన్ సాంగులో లుంగీతో కనిపిస్తాను. కొరియోగ్రాఫర్ స్వర్ణ నాతో అదిరిపోయే స్టెప్స్ వేయించారు. ఆ సాంగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాను' అని చెప్పుకొచ్చింది.

Haripriya lungi dance

గలాట చిత్రంలో 'ఈరోజుల్లో..' ఫేం శ్రీ హీరోగా నటిస్తున్నాడు. దర్శకుడు మాట్లాడుతూ 'ఈ సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ సినిమా. శ్రీ ఇందులో ఒక మంచి పాత్ర చేస్తున్నాడు. కచ్చితంగా ప్రేక్షకులను ఆలరిస్తుంది 'అని చెప్పారు. 'హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ఈచిత్రం ఒక మంచి వినోదాత్మక చిత్రం. ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది' అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో నాగుబాబు, సాయికుమార్, అన్నపూర్ణమ్మ, ఆలీ, మెల్కొటీ, జైవేణు, కొండవలస తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరాః ఫిరోజ్ ఖాన్, పాటలుః కృష్ణచైతన్య, నిర్మాతః రాజేంద్ర ప్రసాద్ వర్మ, దర్శకత్వం:కృష్ణ.

English summary
"I had some doubts initially as the prospect of wearing a lungi did terrify me. It isn't the most glamorous of outfits and it was my introduction song in the Galatta movie" Hari Priya said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu