twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాండ్ కొట్టకండి సార్: రవితేజ, నాగార్జునకు షాకిచ్చిన నెటిజన్లు!

    |

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర సీఎంలు వైఎస్‌ జగన్‌, ఫడణవీస్‌ హాజరయ్యారు.

    ఈ సందర్భంగా తెలుగు సినిమా స్టార్లు అక్కినేని నాగార్జున, రవితేజ ట్వీట్ చేస్తూ... ఈ ప్రాజెక్టును ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటూ ప్రశంసలు గుప్పించారు. కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెబుతూ, తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు కూడా... హరీష్ రావు పేరు ప్రస్తావించక పోవడం కొందరు నెటిజన్లకు కోపం తెప్పించింది.

    ముందు హరీష్ రావును అభినందించండి

    ముందు హరీష్ రావును అభినందించండి

    కాళేశ్వరం ప్రాజెక్టు వెనక ఉన్న ప్రధానమైన వ్యక్తి హరీష్ రావు. ముందు ఆయన్ను అభినందించండి... అంటూ కొందరు రవితేజ ట్వీట్ మీద స్పందిస్తూ కామెంట్లు చేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడానికి ఆయన చాలా కష్టపడ్డారని, ఈ క్రెడిట్ ఆయనకు మాత్రమే దక్కుతుందని మరికొందరు ట్వీట్ చేశారు.

    మీరు కూడా బ్యాండ్ కొడితే ఎట్లా సార్?

    మీరు కూడా బ్యాండ్ కొడితే ఎట్లా సార్?

    రవితేజ గారు.. మీరు కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చారు. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. కాళేశ్వరం గురించి, అది పూర్తి అవ్వడానికి హరీష్ రావు గారు పడ్డ కష్టం గురించి తెల్సుకుని మాట్లాడండి. కనీసం ఆయన పేరు కూడా మీరు ప్రస్తావించలేదు. బ్యాండ్ కొట్టడాలు మీరు కూడా చేస్తే ఎట్లా సార్?... అంటూ కొందరు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

     ఈ సినిమా వాళ్లు ఆయన్ను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు?

    ఈ సినిమా వాళ్లు ఆయన్ను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు?

    కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లు కేటీఆర్‌ను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు కోసం పని చేసింది, కష్టపడింది హరీష్ రావు అనే విషయం మీకు తెలియదా? అంటూ కొందరు సూటిగా ప్రశ్నించారు.

    అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లుగా ఉంది

    అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లుగా ఉంది

    అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో దగ్గరుండి కష్టపడింది హరీష్ రావు అయితే... మెప్పులు, ప్రశంసలు దక్కేది కేటీఆర్ గారికా?... రవితేజ అన్నా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? అంటూ ఓ అభిమాని వ్యాఖ్యానించారు.

    మీ కేసు క్లోజ్ అయిందా?

    మీ కేసు క్లోజ్ అయిందా?

    కేటీఆర్ మీద ప్రశంసలు ఎందుకు? అని కొందరు ప్రశ్నిస్తుంటే... ఓ అభిమాని మాత్రం మీ డ్రగ్స్ కేసు క్లోజ్ అయిందా? అని ప్రశ్నించగా... ‘అంతే‌గా అంతేగా' అంటూ మరొకరు కామెంట్ చేశారు. రవితేజ వీరాభిమానులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆయన సినిమా గురించి అడిగే ప్రయత్నం చేశారు.

    సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిదా?

    సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిదా?

    రవితేజ సార్... మీరు చేసిన ట్వీట్ చూస్తుంటే సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అనే ఫీలింగ్ వస్తోంది. కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెప్పడం ఎందుకు? హరీష్ రావును అభినందించండి అంటూ కొందరు ఘాటుగానే స్పందించే ప్రయత్నం చేశారు.

    కాళేశ్వరం కన్నీరు పెట్టిది తన్నీరు ఎక్కడ అని...

    కాళేశ్వరం కన్నీరు పెట్టిది తన్నీరు ఎక్కడ అని...

    కాళేశ్వరం కన్నీరు పెట్టిది తన్నీరు ఎక్కడ అని, కడుపు నిండా తిండి లేకుండా, కంటికి కునుకులేకుండా ఇటుక మీద ఇటుకు పేర్చిన ఓ రుషి... మరువదు ఈ తెలంగాణ సమాజం నీ కృషి, మిషన్ కాకతీయ అన్నావు, ఊరూరా తిరిగావు, ఊర చెరువులను నింపావు అంటూ హీరీష్ రావు గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

    నాగార్జునకు సైతం సూచించిన అభిమానులు

    నాగార్జునకు సైతం సూచించిన అభిమానులు

    నాగార్జున ట్వీట్ మీద కొందరు నెటిజన్లు స్పందిస్తూ... సార్ థాంక్స్ చెప్పాల్సింది హరీష్ రావుకు, కేటీఆర్‌కు కాదు అంటూ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాత్రింభవళ్లు కష్టపడింది హరీష్ రావు, అభినందిస్తే ఆయన్ను అభినందించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    హరీష్ రావును మరిచిపోవడంపై

    హరీష్ రావును మరిచిపోవడంపై

    నాగార్జున తన ట్వీట్లో హరీష్ రావు పేరు మెన్షన్ చేయక పోవడం చాలా మందికి కోపం తెప్పించినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టు వెనక హరీష్ రావు కష్టం ఉందని, ఆ క్రెడిట్ ఆయనకు కాకుండా కెటీఆర్‌కు ఇవ్వడం సరైంది కాదు అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    "Kaleshwaram lift irrigation project is Undoubtedly an engineering Marvel. Congratulations to KTRTRS TelanganaCMO and credits to all the great minds for making it REAL!" Ravi Teja tweeted. Harish Rao is the main man behind Kaleshwaram, Fans reply to Ravi Teja and Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X