»   »  'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాఫ్ కి పూర్తి కారణం నేనే

'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాఫ్ కి పూర్తి కారణం నేనే

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''రామయ్యా వస్తావయ్యా' పరాజయానికి పూర్తి కారణం నేనే. ఎన్టీఆర్‌ లాంటి హీరో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను అంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఆయన తాజా చిత్రం సుబ్రమణ్యం ఫర్ సేల్ ఈ వారం విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ప్రమోషన్ లో భాగంగా ఇలా స్పందించారు.

ramayya vasthavayya

అలాగే...'ఓ సినిమా ఫ్లాప్‌ ఇచ్చా కదా మళ్లీ హిట్‌ సినిమా తీసే ఇక్కణ్నుంచి కదులుతా' అంటూ దిల్‌రాజుగారి దగ్గర ఛాలెంజ్‌ ఏం చేయలేదు. కథని నమ్మే వ్యక్తి ఆయన. ఈ కథ బాగా నచ్చింది. అందుకే సెట్స్‌పైకి వచ్చింది. హిట్‌ వస్తే నెత్తిమీద ఎక్కించుకొనే పరిశ్రమ.. ఫ్లాప్‌ సినిమా తీస్తే నేలకేసి కొడుతుంది. అందులో తప్పేం లేదు అన్నారు.

 

అలాగే...సినిమా హిట్టయ్యిందని తీయడం మానేస్తామా? ఫ్లాపయితే ఆపేస్తామా?' అంటూ 'నేనింతే' సినిమాలో ఓ డైలాగ్‌ ఉంది. నేనూ అలానే ఆలోచిస్తా. 'షాక్‌' ఫ్లాప్‌ అయ్యిందని 'గబ్బర్‌సింగ్‌' చూడ్డం మానేయలేదు. 'రామయ్యా వస్తావయ్యా' ఆడలేదని 'సుబ్రమణ్యం..' చూడటం మానరు. దేని దారి దానిదే'' అన్నారు.


ఇక ''సినిమా అనేది హీరో చుట్టూనే తిరుగుతుంది. అందుకే హీరో దృష్టిలో ఉంచుకొని కథలు రాసుకోవడం ఏమాత్రం తప్పులేదు. చేతిలో విజయాలున్న హీరోతో సినిమా తీస్తే ఆ సౌలభ్యం వేరుగా ఉంటుంది. కావల్సినంత బడ్జెట్‌ అందుబాటులో ఉంటుంది అన్నారు.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం విశేషాలకు వెళ్తే...

సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

''ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన 'రామయ్య వస్తావయ్యా' అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు'' అని 'దిల్' రాజు అన్నారు.

subrahmanyam2

అలాగే ..'దిల్' రాజు మాట్లాడుతూ - ''సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. '' అని తెలిపారు.

'''మిరపకాయ్' టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను. అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. 'గబ్బర్‌సింగ్' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు.

'పిల్లా నువ్వులేని జీవితం' ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది'' అని హరీశ్‌శంకర్ తెలిపారు.

subrahmanyam


సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌

English summary
Director Harish Shankar admits that he is the reason for Ramayya Vasthavayya.
Please Wait while comments are loading...