»   » హాట్ న్యూస్: మళ్లీ రవితేజతోనే..అదీ సీక్వెల్

హాట్ న్యూస్: మళ్లీ రవితేజతోనే..అదీ సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రవితేజ - హరీష్‌ శంకర్‌ కలయికలో ముచ్చటగా మూడో చిత్రం తెరక్కెబోతోంది. 'మిరపకాయ్‌'కి కొనసాగింపుగా ఆ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఇటీవలే రవితేజ... హరీష్‌శంకర్‌తో సినిమా చేయడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. వీరిద్దరూ ఇదివరకు 'షాక్‌', 'మిరపకాయ్‌' చిత్రాలు చేశారు. తొలి చిత్రం 'షాక్‌' పరాజయాన్ని చవిచూసింది. అయినా... హరీష్‌శంకర్‌లోని ప్రతిభని నమ్మి రెండోసారి అవకాశమిచ్చారు రవితేజ.

'మిరపకాయ్‌' పేరుతో తెరకెక్కిన రెండో చిత్రం చక్కటి ఆదరణను పొందింది. ఆ తర్వాత హరీష్‌శంకర్‌కి పవన్‌కల్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్‌' చేసే అవకాశం దక్కింది. ఆ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. దీంతో హరీష్‌ పేరు పరిశ్రమలో మార్మోగిపోయింది. ఆ ఉత్సాహంలో ఎన్టీఆర్‌తో 'రామయ్యా వస్తావయ్యా' తీశారు. అయితే ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మళ్లీ రవితేజతోనే సినిమా చేయాలని హరీష్‌ నిర్ణయించుకొన్నారు. ఆయనకి ఇటీవల కథ కూడా వినిపించారని తెలిసింది. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ చిత్రం పూర్తవ్వగానే హరీష్‌తో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

రవితేజ కొత్త చిత్రం త్వరలో భారీ ఎత్తున లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బలుపు చిత్రానికి కథ అందించిన బాబి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హన్సికను ఎంపిక చేసినట్లు సమాచారం. రవితేజ..బలుపు చిత్రం తోటే ప్లాప్స్ నుంచి బయిట పడ్డారు. ఇప్పుడీ చిత్రం కూడా పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుందని సమాచారం.

బలుపు హిట్ తో ఊపు మీద ఉన్న రవితేజ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. బలపు రచయిత...బాబి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. వైవియస్ చౌదరి ఈ చిత్రం నిర్మిస్తారనుకున్నారు. అయితే తాను అంత బడ్జెట్ పెట్టలేనని చేతులు ఎత్తేయటంతో రాక్ లైన్ వెంకటేష్ తో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తోంది. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ ఫిల్మ్ గా చిత్రం రూపొందనుందని సమాచారకం. ఈ నెలాఖరనుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. బాబి గతంలో ... డాన్ శ్రీను, బాడీ గార్డ్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు.

వరుస ప్లాపులతో సతమతం అయిన రవితేజకు 'బలుపు' చిత్రం హిట్‌తో కాస్త ఊరట లభించింది. ఇంత కాలం స్క్రిప్టుపై పెద్దగా దృష్టి పెట్టని రవితేజ... బలుపు చిత్రం దగ్గర నుంచి ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. గుడ్డిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటే పోతే తన కెరీర్‌కు ఆపద తప్పదని గ్రహించాడు. అందుకే కథ, స్క్రిప్టు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.

English summary
Harish Shankar, is now planning for his next film. Though he debuted with Ravi Teja and Ram Gopal Varma ‘s Shock, He came into limelight again with Mirapakay and shot to fame with Gabbar Singh. He reminds that if Ravi Teja did not give him a chance, he would have never got another film ad says that he is very ,much indebted to him. Ravi Teja also in seeing the worst phase of his career. Though Balupu is a hit, Ravi Teja has to deliver a blockbuster to retain his stand. So Harish Shankar said that he will make a film with Ravi Teja and give him a block buster to boost up his career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X