»   » ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్ కంట్రిబ్యూషన్ ఎంత?

‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్ కంట్రిబ్యూషన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కెరీర్ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు 'గబ్బర్‌సింగ్'చిత్రం ఘన విజయం సాధించి ఆదుకుంది. ఈ చిత్రం ట్రీట్ మెంట్ విషయంలో పవన్ కళ్యాణ్ సహకారం చాలా ఉందని మీడియా వర్గాల్లో చెప్పుకున్నారు. ఈ విషయమై చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు. సినిమా విషయంలో కల్యాణ్‌గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.

Harish Shankar talks about Pawan Kalyan, Gabbar Singh

హరీష్ శంకర్ మాట్లాడుతూ... 'గబ్బర్‌సింగ్' సినిమా విషయంలో కల్యాణ్‌గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. 'గబ్బర్‌సింగ్' టైటిల్ పెట్టింది ఆయనే. క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో ఓ మంచి మద్దెల ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయన చెబితే.. 'అంత్యాక్షరి ఎపిసోడ్'ని డిజైన్ చేసి దాన్ని పర్పస్‌ఫుల్‌గా వాడాను. సినిమా మొత్తానికి ఎంత కష్టపడ్డానో.. ఆ ఒక్క ఎపిసోడ్ విషయంలో అంత కష్టపడ్డాను. దాదాపు మూడొందల పాటల్ని విని, అందులోంచి కొన్ని పాటల్ని వడపోత కట్టి, ఆ ఎపిసోడ్ చేశాం.

తర్వాత చాలా సినిమాల్లో దాన్ని ప్రేరణగా తీసుకొని సన్నివేశాలొచ్చాయి. ఆ సినిమా మాతృక 'దబాంగ్'ను నేనెంత ఛేంజ్ చేయకపోతే.. 'మాటలు, మార్పులు' అనే టైటిల్ కార్డ్ వేసుకుంటానో అర్థంచేసుకోండి. కల్యాణ్‌గారి 'తొలిప్రేమ' షూటింగ్ బీహెచ్‌ఈఎల్‌లో జరిగినప్పట్నుంచీ, 'గబ్బర్‌సింగ్' తొలిషాట్ తీసేంతవరకూ.. ఈ మధ్యలో వచ్చిన వపన్ సినిమాలు, పవన్ డైలాగులు, పవన్ స్టైల్స్‌తో కలిసి నేను చేసిన ప్రయాణ ఫలితమే 'గబ్బర్‌సింగ్' సినిమా. పవన్‌పై నాకున్న ఇష్టానికి ప్రతీక 'గబ్బర్‌సింగ్' అన్నారు.

English summary
Gabbar Singh and Harish Shankar can't be separated. That's the impact this young filmmaker has created with the Blockbuster film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu