»   » హీరోయిన్ నే పెళ్లిచేసుకుంటున్నాడు

హీరోయిన్ నే పెళ్లిచేసుకుంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బిపాసా బసు త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో హార్మన్‌ బవేజాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. జాన్‌ అబ్రహమ్‌తో చాన్నాళ్లు ప్రేమాయణం సాగించిన బిపాసా... అతనితో విడిపోయిన తరవాత హార్మన్‌కి దగ్గరైంది. ఇటీవలే హార్మన్‌ కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ బిపాసాతో ప్రేమ వ్యవహారం గురించి వెల్లడించారు. బిపాసా కూడా ట్విట్టర్‌ ద్వారా వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలిపింది.

Harman Baweja Confirms his Relationship with Bipasha Basu

బిపాసా ట్వీట్ చేస్తూ... ''నేను, హార్మన్‌ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎట్టకేలకు ఓ గొప్ప వ్యక్తిని నేను కలిసేలా చేసి దేవుడు నన్ను ఆశీర్వదించాడు'' అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం హార్మన్‌ 'డిష్కియాన్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రాతో కలిసి నిర్మిస్తున్న చిత్రమిది.

ఈ సినిమా తరవాత హార్మన్‌, బిపాసాల నిశ్చితార్థం ఉంటుంది. వీరిరువురి తల్లిదండ్రులు ఇప్పటికే నిశ్చితార్థం, పెళ్లి గురించి మాట్లాడుకొన్నారట. అందుకే వారిద్దరూ తమ బంధం గురించి బహిరంగంగా చెప్పుకొంటున్నారు. నిశ్చితార్థం తరవాత ఎక్కువ విరామం తీసుకోకుండానే పెళ్లి కూడా చేసుకోవాలని బిపాసా-హార్మన్‌ భావిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

English summary

 Bollywood actor Harman Baweja has finally confessed about his relationship with Bipasha Basu. After months of speculations and being spotted together, Harman has disclosed his love for the "Jism" actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu