»   » ఈ యేటి మేటి చెత్త హీరో, హీరోయిన్స్ ఎవరంటే...

ఈ యేటి మేటి చెత్త హీరో, హీరోయిన్స్ ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ఉత్తమ చెత్త నటిగా కరీనా కపూర్...కంబఖ్త్‌ ఇష్క్ సినిమా నిమిత్తం ఎంపికైంది. అలాగే ఉత్తమ చెత్త హీరోగా హర్మాన్‌ బవేజా (వాట్స్‌ యువర్‌ రాశి) ఎంపికయ్యారు. ఇక ఉత్తమ చెత్త దర్శకుడుగా అశుతోష్‌ గోవారికర్‌ (వాట్స్‌ యువర్‌ రాశి) ఎంపికయ్యారు. ఈ 'గోల్డెన్‌ కేలా' చెత్త అవార్డులన్నీ ర్యాండమ్‌ మేగజీన్‌ సంస్థ ప్రకటించింది. గోల్డెన్‌ కేలా ద్వితీయ వార్షికోత్సవ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలోని ఇండియా హేబిటేట్‌ సెంటర్‌లో రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఓటింగ్‌ ఆధారంగా మేగజీన్‌ నిర్వాహకులు ఈ అవార్డులను ప్రకటించారు. 'సైరస్‌ బరోచా స్మారక అవార్డు' గ్రహీత సైరస్‌ బరోచా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక మిగతా విభాగాల్లో చెత్త అవార్డులను అందుకున్న మిగతావారి వివరాలు ఇలా ఉన్నాయి. సహాయనటి: దీపికా పదుకొనే (చాందినీ చౌక్‌ టు చైనా), సహాయనటుడు: రణవీర్‌ షోరే (చాందినీ చౌక్‌ టు చైనా), నూతన నటి: శ్రుతి హసన్‌(లక్‌), నూతన నటుడు: జాకీ భగ్నాని(కల్‌ కిస్నే దేఖా), జంట: రాణి ముఖర్జీ, షాహీద్‌ కపూర్‌(దిల్‌బోలే హడిప్పా), కాపీ చిత్రం : దిల్‌బోలే హడిప్పా, దారాసింగ్‌ అవార్డు (చెత్తఉచ్చారణ): అభిషేక్‌ బచ్చన్‌(ఢిల్లీ 6), బ్లాక్‌ అవార్డు (భావోద్వేగాలతో ఆడుకోవడం): అమితాబ్‌(పా), లజ్జ అవార్డు (సీరియస్‌ అంశాన్ని చెత్తగా తీసినందుకు): దర్శకుడు కబీర్‌ఖాన్‌, నిర్మాత ఆదిత్యచోప్రా (న్యూయార్క్‌). ఒకే మూస చిత్రాలు తీస్తున్న నిర్మాత మాథుర్‌ బండార్కర్‌కు బస్‌ కీజీయే బహుత్‌ హో గయా (చాలా ఎక్కువైంది ఇక ఆపండి) అవార్డు ప్రకటించారు. మరి మన తెలుగులో కూడా చెత్త అవార్డులను ఎవరికి ఇవ్వచ్చరంటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu