twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    8 నెలలు కష్టపడ్డా, రవితేజ అలా చేయడంతో బాధపడ్డా: బోరుమంటున్న దర్శకుడు

    తమిళ సినిమా ‘బోగన్’ రీమేక్ నుండి మాస్ మహరాజ్ రవితేజ తప్పుకున్నారు. స్క్రిప్టు సిద్ధమైన తర్వాత రవితేజ తప్పుకోవడంపై దర్శకుడు లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    రవితేజ ను నమ్మి బోరుమంటున్న దర్శకుడు!

    'రాజా ది గ్రేట్'...రూపంలో చాలా కాలం తర్వాత రవితేజ ఖాతాలో హిట్ పడింది. అంతకు ముందు వరుస ప్లాపులు ఎదుర్కొన్న మాస్ మహారాజ ఈ విజయంతో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. రొటీన్‌గా ఉండే సినిమాలు కాకుండా... కొత్తగా, డిఫరెంటుగా ఉండే సబ్జెక్టులు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు.

    తన కొత్త నిర్ణయం తర్వాత గతంలో కమిటైన కొన్ని సినిమాలను కూడా రవితేజ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా 'బోగన్' అనే తమిళ రీమేక్ చిత్రాన్ని చేయను అని తెగేసి చెప్పారట.

    ‘రాజా ది గ్రేట్’ కంటే ముందే అనుకున్నారు

    ‘రాజా ది గ్రేట్’ కంటే ముందే అనుకున్నారు

    ‘రాజా ది గ్రేట్' సినిమా కంటే ముందే ‘బోగన్' తెలుగు రీమేక్‌కు రవితేజ ఓకే చెప్పారు. ఈ చిత్రంలో ర‌వితేజ‌ను హీరోగా, కేథ‌రీన్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. త‌మిళ న‌టుడు ఎస్‌జే సూర్య‌తో విలన్ రోల్ చేయించాలనుకున్నారు.

    బోరుమన్న దర్శకుడు

    బోరుమన్న దర్శకుడు

    జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామిలు న‌టించిన 'బోగ‌న్' చిత్రానికి తమిళంలో లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ఈ కథను రవితేజకు వినిపించడంతో ఆయనకు నచ్చి ఒకే చెప్పాడు. తాను ఎంతో కష్టపడి రవితేజ ఇమేజ్‌కు తగిన విధంగా స్క్రిప్టులో మార్పులు చేసిన తర్వాత చేయను అని చెప్పడంతో దర్శకుడు లక్ష్మణ్ బోరుమంటున్నాడు.

    చాలా బాధపడ్డాను

    చాలా బాధపడ్డాను

    ఈ సినిమా చేయ‌డానికి ర‌వితేజ ఒప్పుకోవ‌డంతో దాదాపు ఎనిమిది నెల‌లు క‌ష్ట‌ప‌డి స్క్రిప్ట్‌లో మార్పులు చేశానని, రవితేజ ఇలా చేయడంతో చాలా బాధ కలిగిందని, తన కష్టం అంతా వృధా అయిందని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

    ఏం చేయాలో అర్థం కాలేదు

    ఏం చేయాలో అర్థం కాలేదు

    రవితేజ సినిమా చేయడానికి నో చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదే కథను వేరే హీరోతో చేయాలా? లేక మరో ప్రాజెక్టు మొదలు పెట్టాలా? అనే ఒక నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుంది అని లక్ష్మణ్ తెలిపారు.

    English summary
    Ravi Teja backed out of doing the remake of Tamil film Bogan following his success with Raja The Great and director Lakshman is upset. Talking to a leading online entertainment portal, Lakshman said: “I had to rework the script for the Telugu audience. Also, Ravi Teja had done a certain type of films, to suit his style I tweaked my script. Now, when he says he cannot do the film, it is very upsetting. I need time to think about what to do next – to go with another actor or start working on a Tamil film.” Apparently, following the success of Raja The Great, Ravi is not too keen on doing a remake at this point in his career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X