»   » కపిల్‌శర్మకు రంగుపడింది.. డెడ్‌లైన్‌తో షాక్.. ఇక దేవుడి మీదే భారం!

కపిల్‌శర్మకు రంగుపడింది.. డెడ్‌లైన్‌తో షాక్.. ఇక దేవుడి మీదే భారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమెడియన్ సునీల్ గ్రోవర్‌తో గొడవ కపిల్ శర్మ పీకల మీదకు తెచ్చింది. ది కపిల్‌శర్మ షో నుంచి సునీల్ గ్రోవర్ తప్పుకోవడంతో రేటింగ్ దారుణంగా పడిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నెలలోపు టెలివిజన్ రేటింగ్‌ను పెంచాలని సోని టెలివిజన్ డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో కపిల్ శర్మకు కష్టాలు మొదలైనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సునీల్‌తో కపిల్ గొడవ

సునీల్‌తో కపిల్ గొడవ

ది కపిల్ శర్మ షో‌కు కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సునీల్ గ్రోవర్‌ది ప్రధాన పాత్ర. వీరిద్దరూ కలయికలో ఈ షో విశేష ప్రజాదరణ పొందింది. ఇటీవల విమానంలో జరిగిన గొడవ సమయంలో సునీల్ గ్రోవర్‌పై కపిల్ చేయి చేసుకొన్నట్టు సమాచారం. దాంతో ఈ షో నుంచి సునీల్ గ్రోవర్ తప్పుకొన్నారు.

దారుణంగా టీవీ టీఆర్పీలు

దారుణంగా టీవీ టీఆర్పీలు

ఈ కార్యక్రమం నిర్వహణ కోసం సోని టెలివిజన్ కపిల్‌కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ముట్టజెప్తున్నది. రేటింగ్ దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో సోని టీవి కపిల్ హెచ్చిరించిందట. నెలరోజుల లోపు కామెడీ షోకు మళ్లీ వైభవం తీసుకురావాలని సూచించినట్టు సమాచారం.

రద్దు చేయడానికైనా సిద్ధం

రద్దు చేయడానికైనా సిద్ధం

సోని టెలివిజన్ విధించిన డెడ్‌లైన్ సామాన్యమైనదేమీ కాదనే వాదన మొదలైంది. ఇప్పటికే ఈ షోలో నటించే కీలక సభ్యులు కపిల్ పై కోపంతో తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో కామేడి షో ఆకట్టుకుంటుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒకవేళ కామెడీ షో పుంజుకోకపోతే కార్యక్రమాన్ని రద్దు చేయడానికైనా సాహసించదని పరిశ్రమ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

కపిల్‌కు సునీల్, అలీ, చందన్ షాక్

కపిల్‌కు సునీల్, అలీ, చందన్ షాక్

కపిల్ శర్మ షో కోసం సునీల్ గ్రోవర్, అలీ అస్గర్, చందన్ ప్రభాకర్ మూల స్తంభాలుగా నిలిచారు. విమానంలో గొడవ తర్వాత ఈ ముగ్గురు అనూహ్యంగా తప్పుకొన్నారు. అయితే సునీల్ గ్రోవర్ స్థానంలో రాజు శ్రీవాస్తవను తీసుకొన్నట్టు సమాచారం.

English summary
The viewership rating of The Kapil Sharma Show is going down, and that has worried the channel airing it. Now, Sony wants Sharma to think seriously about it. Reports suggests that Sharma has been given a month’s time to prove his worth and high remuneration. If things don’t improve, then the channel might take the show off-air.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu