»   »  ఒక్క ట్రైలర్ కోసం 22 ఏళ్ళ సినిమాని ఆపేస్తారట?: డీడీఎల్ ఆగిపోతుందా? ఆందోళనలో అభిమానులు

ఒక్క ట్రైలర్ కోసం 22 ఏళ్ళ సినిమాని ఆపేస్తారట?: డీడీఎల్ ఆగిపోతుందా? ఆందోళనలో అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే', భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో 22 ఏళ్ల పాటు ప్రదర్షితమవుతూనే ఉంది. 1995, అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికీ ఆ థియేటర్ లో రోజూ ప్రదర్శితం అవుతూనే ఉంది.

మరాఠా మందిర్

మరాఠా మందిర్

యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు. నాడు ప్రేమ జంటలను విశేషంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రానికి నేటికీ ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా కోసం పెద్ద సంఖ్యలో యువత మరాఠా మందిర్ కు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో థియేటర్ పూర్తి స్థాయిలో నిండిపోతోందట.

అభిమానుల ప్రోత్సాహంతో

అభిమానుల ప్రోత్సాహంతో

గతంలో రెండు, మూడు సార్లు షోని క్లోజ్‌ చేయాలని అనుకున్నా, అభిమానుల ప్రోత్సాహంతో మళ్ళీ ఆట మొదలైంది. అయితే అన్ని షో లూ కాకుండా మిగతా సినిమా ప్రదర్షన నాలుగు షో లు ఉంటే మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా దిల్వాలే దుల్హనియా లేజాయేంగే షో పడి తీరల్సిందే. అయితే ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఆ సినిమా కి అంతరాయం రానుంది.

'హసీనా-ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి'

'హసీనా-ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి'

ఎందుకంటే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా జీవిత నేపథ్యంలో 'హసీనా-ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి' అనే చిత్రం తెరకెక్కిన ‘హసీనా' ట్రైలర్‌ని ముంబయిలోని మరాఠా మందిర్ థియేటర్‌లో విడుదల చెయ్యాలని చిత్ర బృందం అనుకుంది. అదే థియేటర్‌లో 22 ఏళ్లగా ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' చిత్రం ఒక్క షో కూడా ఆపకుండా ప్రదర్శించబడుతుంది.

హాసీనా పార్కర్‌

హాసీనా పార్కర్‌

ఆ ట్రైలర్‌ ప్రదర్శించాలంటే మంగళవారం మాట్నీ షో ఆపాలి. అందుకు డోంగ్రి ప్రాంతంలో షారుఖ్‌ అభిమానులు అంగీకరించలేదట. అదే ప్రాంతంలో దావూద్‌, హసీనా పుట్టి పెరిగారని మరాఠా మందిర్‌ థియేటర్‌లో ‘హాసీనా పార్కర్‌' ట్రైలర్‌ని విడుదల చెయ్యాలనుకుంటున్నారు. మరి ఆ ఒక్క రోజు షో ఆపేస్తారా లేక టైమింగ్స్ మారుస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న.

English summary
Haseena Parkar's makers have a special reason to screen the trailer in Maratha Mandir, which will disrupt Dilwale Dulhania Le Jayenge's screening for the first time since 1995
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu