»   » తేల్చి చెప్పింది: 'బాహుబలి-2' లో నటించడం లేదు!

తేల్చి చెప్పింది: 'బాహుబలి-2' లో నటించడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'బాహుబలి-2'లో తాను రానా సరసన నటించబోతున్నానని మీడియాలో వస్తోన్న వార్తల విషయమై మాట్లాడింది శ్రియ. చాలా విరామం తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఈ సుందరి మీడియాతో ముచ్చటించింది.

శ్రియ మాట్లాడుతూ... రాజమౌళిగారితో మళ్లీ పనిచేయాలని వుంది. ఆయన సినిమాల్ని నేను ఎంతగానో అభిమానిస్తాను. బాహుబలి చిత్రాన్ని నాలుగుసార్లు చూశాను. అయితే బాహుబలి-2లో నేను ఎటువంటి పాత్రను చేయడం లేదు అని చెప్పింది శ్రియ.


Haven't been approached for Baahubali 2: Shriya

అలాగే... కెరీర్ తొలినాళ్లలోనే చిరంజీవిలాంటి స్టార్‌హీరోతో ఠాగూర్ చిత్రంలో నటించానని, ఆయన నటించబోయే 150వ చిత్రంలో అవకాశమొస్తే అదృష్టంగా భావిస్తానని పేర్కొంది.


ఇక సీనియర్ హీరోయిన్స్.. మహిళా ప్రధాన చిత్రాల్లో నటించడం శుభపరిణామమని, మల్టీఫ్లెక్స్‌లు పెరగడం వల్ల లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరిగిందని చెప్పింది. పాత్రలపరంగా ప్రయోగాలకు సిద్ధంగా వున్నానని, సంగీత నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని తెలిపింది.


Haven't been approached for Baahubali 2: Shriya

దక్షిణాదిన మంచి ఆఫర్లు వస్తున్నాయని, తన స్థాయికి తగిన పాత్రల్నే ఎంచుకుంటున్నానని చెప్పింది. తెలుగులో కెరీర్ ముగిసిపోలేదని, ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయని వెల్లడించింది.

English summary
“I would love to work with Rajamouli sir again. I have been a big fan of his work and thoroughly enjoyed the process of working with him. He is an institution. I have seen Baahubali two to three times and I know all the actors in the film so it will be like going back to a family. But I have not been offered any role though,” says Shriya who jokes about the kind of stories that seem to be made by the media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu